Tuesday, 22 Sep, 1.49 pm NewsSting

తెలుగు హోం
నా జీవితంలో ఆగష్టు 22కు ఎంత ప్రాముఖ్యత ఉందో.. సెప్టెంబర్ 22 కూడా అంతే..- చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22. ఆ రోజు అభిమానులకు పండగ రోజు. ఆయన చిరు స్ధాయి నుంచి ప్రజల హృదయాల్లో చిరంజీవిగా.. సుస్థిర స్ధానం దక్కించుకున్నారు. ఎందరికో స్పూర్తిగా నిలిచారు. ఇంకా చెప్పాలంటే... తెలుగు సినిమా స్థితి, గతి మార్చేసిన మహా వ్యక్తి. ఆయన ప్రస్థానానికి 42 వసంతాలు.ఈ ప్రస్థానంలో ఎన్నో విజయాలు.. ఆయనకు అపజయం వచ్చిన ప్రతి సారి రెట్టింపు కసితో కృషి చేసారు.. విజయాలు దక్కించుకున్నారు. అందుకనే.. కష్టం ఆయన హీరోయిజం.. ఇష్టంతో పని చేయడం ఆయన మేనరిజం.అయితే.. ఈ రోజు చిరంజీవి ట్విట్టర్ లో స్పందిస్తూ.. నా జీవితంలో ఆగష్టు 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో.. సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆగష్టు 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజు అయితే... సెప్టెంబర్ 22 ప్రాణం (ఖరీదు) పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్ధాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ ఈ సందర్భంగా మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని చెప్పారు.చిరంజీవి తాజా చిత్రానికి విషయానికి వస్తే...

ఆచార్య నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top