Thursday, 13 Aug, 5.41 pm NewsSting

తెలుగు హోం
ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. కరోనాతో విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా వివిధ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది. అయితే, యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని కోర్సులకు చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ పరిధిలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు షెడ్యూల్‌ను సిద్దం చేశారు.గతంలో కాకుండా విద్యార్ధులు తమకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్లలోనే పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. కరోనా కారణంగా విద్యార్ధులు ఇళ్ళలోనే వుంటున్నారు. దీంతో వారు తమకు దగ్గర్లోని సెంటర్ ని ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది. అలాగే సుమారు 60 వేల మంది విద్యార్ధులు వివిధ అటానమస్ కాలేజీల ద్వారా బీటెక్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాయనున్నారుమరోవైపు 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు ఏఐసీటీఈ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆగష్టు 24 నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించనుంది.

రోజుకు నాలుగు పీరియడ్స్ బోధించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రతీ పిరియడ్‌ గంట చొప్పున.. మార్నింగ్ మూడు.. లంచ్ తర్వాత ఒక పిరియడ్ జరగనున్నాయి. నెలరోజుల పాటు ఈ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాక పరిస్థితిని సమీక్షిస్తారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top