తెలంగాణ రాజకీయాలు
ఓల్డ్ మలక్ పేట్ లో రీ పోలింగ్ ప్రారంభం

గుర్తులు మారడంతో ఓల్డ్ మలక్ పేట్ లో మొన్న ఇష్యూ అయింది కదా.బ్యాలెట్ పేపర్లో సీపీఐ అభ్యర్థి గుర్తు తప్పుగా ముద్రించడంతో.. అప్పుడే రీ పోలింగ్ అనౌన్స్ చేశారు. రేపే ఫైనల్ రిజల్ట్ కావడంతో ఇవాళ రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల రీ పోలింగ్ సందర్భంగా.. ఓల్డ్ మలక్ పేట్ లో సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. వ్యాపార వాణిజ్య సంస్థలకు కూడా సెలవు వర్తిస్తుంది.అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు అధికారులు. ఇటు లీడర్లు కూడా అదే రిక్వస్ట్ చేస్తున్నారు. ఇక జనాలు కూడా బానే క్యూ కట్టారు. రెండోసారి ఓటింగ్ కి వెళ్లాల్సి వచ్చినా.. ఏ మాత్రం తగ్గకుండా పోలింగ్ సెంటర్లలో వాలిపోయారు.
సాయంత్రంలోగా.. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తున్నారు అధికారులు. చూస్తుంటే అన్ని సెంటర్ల కంటే ఇక్కడే పోలింగ్ శాతం ఎక్కువ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక అభ్యర్థులు గుండెల్లో టెన్షన్ మొదలైంది.
మొన్నటి జనాలు.. అలాగే ఉంటారా.. వేరే పార్టీపై ఇంట్రస్టులేమైనా చూపిస్తారా అనే లెక్కల్లో ఉండిపోయారు. రెండోసారి ప్రచారం చేసుకునే అవకాశం రాకపోవడంతో.. టెన్షన్ లో ఉన్నారు. 69 పోలింగ్ సెంటర్లలో 54 వేల 655 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
related stories
-
ప్రధాన వార్తలు 84 వార్డుల్లో సింగిల్ నామినేషన్లే..
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు స్థానికంలోనూ కేంద్ర ఎన్నికల ప్రవర్తన నియమావళే
-
విశాఖపట్నం ఎన్నికలకు రాజకీయ పక్షాలు సహకరించాలి