Wednesday, 27 Jan, 4.58 pm NewsSting

తెలుగు హోం
పవన్ ఓ దొంగ

టైటిల్ కాస్త డిపరెంట్ గా ఉంది కాబట్టి.. ఇదేదో పొలిటికల్ లీడర్ చేసిన కామెంట్ కాదులెండి. ఇది పక్కాగా సినిమా న్యూసే. మూవీ అప్డేట్స్ లో ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. పవన్ కల్యాణ్ అంటే ఓ రేంజ్ హీరోయిజం ఉండాలి. ఓ రేంజ్ మెస్సేజ్ లు ఇవ్వాలి. తంతే వంద మంది గాల్లో ఎగిరి పడాలి. మేనరిజమ్ చూపిస్తే.. థియేటర్స్ లో విజిల్స్ మారు మోగాలి. ఇది రెగ్యులర్ పవన్ స్టైల్ మూవీస్ ఎవ్వారం. కానీ.. త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్న సినిమా మాత్రం అలా కాదు. చాలా చాలా డిఫరెంట్. పవన్ కల్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ చేయని ఓ సినిమా. అసలు ఇలాంటి పాత్ర చేస్తాను అని తను అనుకోని.. తన ఫ్యాన్స్ కూడా ఊహించని ఓ సినిమా చేయబోతున్నాడట పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. మరి అంత గనం విశేషం ఉన్న సినిమా ఏందయ్యా అంటే.. పీరియాడిక్ మూవీ. మొఘల్స్ కాలం నాటి ఓ పీరియాడిక్ మూవీలో నటించబోతున్నారట. అలా అని రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసే సినిమా కాదులెండి..

పక్కాగా ఫిక్షన్ మూవీనేనట. మరి ఇస్పిరేషన్ లు గట్రా ఉంటే అది వేరే మేటర్. ఇక్కడ మేటర్ ఏందయ్యా అంటే.. పవన్ కల్యాణ్ ఓ దొంగగా యాక్ట్ చేయబోతున్నాడు.

అది కూడా మొఘల్స్ కాలాన్ని బేస్ చేసుకుని నడిచే స్టోరీలే. మరి దొంగనా హీరోనా అంటే.. డౌటేం లేదు. దొంగ హీరో కావచ్చు.

అలా అని.. మరీ జేబులు దొంగతనం చేసే హీరో కాదటలే. పవర్ స్టార్ అనే స్టార్ డమ్ కి ఉన్న రేంజ్ కి తగ్గట్లే.. కాస్ట్లీగా వజ్రాలు దొంగతనం చేసే పాత్ర చేస్తున్నాడట పవన్ కల్యాణ్‌.మరి ఈ అత్యద్భుత కథకి..

డైరెక్టర్ ఎవరయ్యా అంటే మాత్రం.. క్రిష్. మరి క్రిష్ అంటే అంతే కదా. తను ఏదో ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ పట్టుకుంటాడు.

దాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తాడు. మొన్న డైరెక్ట్ చేసిన.. ఎన్టీఆర్ సినిమాలు దెబ్బై పోయాయి. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన..

మణి కర్ణిక విషయంలో కూడా కాస్త ఇబ్బందులు పడ్డాడు. ఈసారి మాత్రం అలా కాదట. తన సొంతంగా.. అద్భుతంగా తీర్చి దిద్దిన పాత్రలో పవన్ కల్యాణ్ యాక్ట్ చేయబోతున్నాడు.

ఇక పవన్ కల్యాణ్ రేంజ్ కి తగ్గట్లు.. 170 కోట్ల దాకా ఖర్చు అవుతుందంట ఈ మూవీకి. ముందుగా 120 కోట్లే అనుకున్నా.. మరో 50 కోట్ల బడ్జెట్ పెరిగిందంట.

మరి షూటింగ్ కూడా రిచ్ గా ఉంటుంది కదా. సెట్ లు గట్రా ఉంటయాయే. పైగా.. రాజస్థాన్, గుజరాత్ లాంటి ఏరియాల్లో షూట్ చేస్తారట.

ఇక పవన్ తో రొమాన్స్ చేసే విషయంలో.. హాట్ అందాల నిధి అగర్వాల్ ని బుక్ చేశారు. బంపర్ ఛాన్స్ కొట్టింది ఇస్మార్ట్ బేబీ. మరో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఒంపులూ వయ్యారాలతో పిచ్చెక్కిస్తోన్న..

జాక్వెలీన్ ఫెర్నాండేజ్ ఛాన్స్ కొట్టేసింది. షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. రిలీజ్ ఎప్పుడు అవుతుందో కానీ.. పవన్ కల్యాణ్ భక్తులకి మాత్రం ఇది పండగ లాంటి న్యూసే.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top