తెలుగు హోం
రేవంత్ రెడ్డికి ఇప్పట్లో పదవి లేనట్లే

సీనియర్ పొలిటీషియన్. ఫైర్ బ్రాండ్. ఏ పక్షాన్ని అయినా దుమ్ములేపే కెపాసిటీ. తెలంగాణలో ఏ ప్లేస్ లో నుంచున్నా గెలవడమో.. గెలుపు దగ్గరికి తీసుకురావడమో చేసేంత పవర్ ఉంది. కేడర్ ఉంది కేలిబర్ కూడా ఉంది. కానీ.. అధ్యక్ష పదవి విషయంలో మాత్రం.. ఎవ్వారం ఎక్కడో తేడా కొడుతోంది. కారణం ఏంటో అందరికీ తెలిసిందే.. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ లీడర్లు చాలా మందే ఉన్నారు. ఆ పదవి కోసం పోటీ పడుతున్న లీడర్లు కూడా బలమైన వారే.. ఓ మెట్టు ఎక్కువ హైట్ తూగ గలరు అని రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే.. సీనియర్లు అంతాసైడై పోతారేమో అని కాంగ్రెస్ అధిష్టానం భయం. పోనీ వారినే అధ్యక్ష పదవిలో కూర్చోబెడదాం అంటేనేమో..
రేవంత్ రెడ్డి కేలిబర్ ని ఫుల్ గా పార్టీ సేవలకు ఉపయోగించుకోలేమేమో అనే కన్ ఫ్యూజన్. ఇన్ని గొడవల మధ్యలో నాగార్జున సాగర్ బై పోల్ రావడంతో ఎవ్వారం అంతా కూల్ అయింది.మరి నాగార్జున సాగర్ ఎన్నిల కు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు ప్రచారం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి ఆ సీటులో గెలుపు కోసం సహాయపడతారు.
తర్వాత.. రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి ఎప్పుడు ఇవ్వాలి. ఎప్పుడు ఎప్పుడు అనే క్వశ్చన్ లకి కాంగ్రెస్ తెలంగాణ లీడర్ల దగ్గర ఆన్సర్ లేదు. అఫ్ కోర్స్..
సెంట్రల్ కాంగ్రెస్ లీడర్ల దగ్గర కూడా ఆన్సర్ లేదు. చూస్తుంటే.. నాగార్జున సాగర్ ఎన్నికలకి ఇంకా టైం పట్టేలా ఉంది. ఈలోగా..
ఖమ్మం వరంగల్ లాంటి మున్సిపల్ ఎన్నికల హడావిడి ఉండబోతుంది. అప్పుడు కూడా అధ్యక్ష పదవిలో నుంచో బెడితే పార్టీలో చీలకలు వస్తాయేమో.. కలిసి పని చేయరేమో అనే భయం ఉండనే ఉంటుంది.పోనీ.. ఆ తర్వాత అయినా..
రేవంత్ రెడ్డికో.. లేదంటే వేరే లీడర్ కి అధ్యక్ష పదవి ఇచ్చి.. కన్ ఫ్యూజన్ కి చెక్ పెడతారేమో అంటే.. అక్కడ కూడా క్లారిటీస్ లేవు.
ఎందుకంటే.. జూన్ లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. మరి అక్కడ కూడా గ్రూపు రాజకీయాలకేం తక్కువ లేవు. ఎవరిని నుంచోబెట్టాలి..
ఎవరిని బుజ్జగించాలి అంటూ చాలా ఇష్యూస్ ఉన్నయ్. సో.. ఇక్కడి ఎన్నికలు అయిపోయే టైంకి.. అక్కడ కేంద్రంలో అధ్యక్ష పదవి ఎన్నికలతో బిజీగా ఉంటుంది..
కాంగ్రెస్ అధిష్టానం. ఆ టైంలో.. రాష్ట్రాల గురించి.. ఇక్కడి గ్రూపు రాజకీయాల్ని కూల్ చేయడం గురించి..
పెద్దలు ఏమాత్రం ఆలోచిస్తారు అనేది డౌటే. ఎందుకంటే.. ఇది వెంటనే అయిపోయే ప్రాసెస్ కాదు కాబట్టి.. టైం పడుతుంది.
చూస్తుంటే.. నేషనల్ కాంగ్రెస్ కి అధ్యక్ష పదవిపై క్లారిటీ వచ్చేంత వరకూ.. టీపీసీసీ అధ్యక్ష పదవిపై క్లారిటీ రాకపోవచ్చు అనిపిస్తోంది. అలా అయితే మాత్రం.. నాకే పదవి వస్తుంది అనుకుంటున్న రేవంత్ రెడ్డికి వెయిటింగ్ తప్పదేమో.
related stories
-
హెరాల్డ్ కార్డ్స్ మనము ఎన్ని అనుకున్నా కానీ ఈ ఎన్నికల సందర్భంలో సగటు మానవుడు ఏపీలో టీడీపీ ఘోర...
-
ముఖ్యాంశాలు బాలయ్య గాలి తీసేసిన కొడాలి నానీ
-
ముఖ్యాంశాలు పుర పోరు : విశాఖలోనే బాబు మకాం...లెక్క సరి చేస్తారా...?