తెలుగు హోం
సభలో నరేంద్ర మోదీ కూడా.. మాట్లాడకుండానే వెళ్ళిపోయిన మమతా

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీని ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. మమతా బెనర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకే వేదికపై కనిపించడం విశేషం. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కూడా వారితో పాటు ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి సందర్భంగా కోల్ కతాలోని విక్టోరియా మెమోరియల్ లో నిర్వహించిన కార్యక్రమానికి వీరు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడకుండా వెళ్ళుపోయారు. విక్టోరియా మెమోరియల్ లో కార్యక్రమం జరుగుతున్న వేళ, మమతా బెనర్జీ ప్రసంగించడానికి ముందు సభలోని కొందరు 'జై శ్రీరామ్', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు.
తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె, ఇదేమీ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని గుర్తు చేశారు. ఇక్కడ గౌరవంగా ఉండాలని సభకు హాజరైన వారికి హితవు పలికారు. తాను ప్రసంగించబోనని చెబుతూ, కార్యక్రమానికి హాజరైన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపి వేదికపై నుంచి వెళ్లిపోయారు. మమతా బెనర్జీ మాట్లాడడానికి ముందు సభలో నినాదాలు చేస్తున్న వారిని పదేపదే అధికారులు వారించారు.
ఈ నినాదాల కారణంగా మమతా బెనర్జీ ఒకింత అసంతృప్తికి గురయ్యారు. ఆమె కూడా సభికులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని.. ఇది ప్రజల కార్యక్రమమని వ్యాఖ్యానించారు.
ఈ సభలో మాట్లాడేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. జై హింద్ చెప్పేసి వెళ్లిపోయారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ సభలో భరతమాతను తలచుకోవడం ముదావహమేకానీ, శ్రీరాముడిని తలచుకునే సందర్భం ఇది కాదని అన్నారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని..
నరేంద్ర మోదీ కోల్ కతా పర్యటన ఉంటుందని తెలియగా.. ప్రధాని పర్యటనకు ముందే మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. శ్యాం బజార్ నుంచి రెడ్ రోడ్ వరకు పాదయాత్ర చేశారు. నేతాజీకి ఘన నివాళులు అర్పించారు.
పాదయాత్రలో మమతకు తోడుగా వేలాది మంది తరలివచ్చారు. భారతదేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాను రాజధానిగా చేసుకొని అప్పట్లో ఆంగ్లేయులే పాలించారని, అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ఒకే రాజధాని ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు.
dignity (noun) The state or quality of being worthy of honour and respect.
- Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) January 23, 2021
You can't teach 'dignity'. Nor can you teach lumpens to be dignified.
Here is a one-min video of what exactly happened today. Including the dignified response by @MamataOfficial pic.twitter.com/aEQ3jF7CYf
related stories
-
జాతీయం దేశం పేరునూ మోదీగా మారుస్తాడు!
-
తెలంగాణ తాజావార్తలు తెలంగాణ సొమ్ములు యూపీకి
-
తాజా వార్తలు మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం