Friday, 23 Oct, 2.49 pm NewsSting

తెలుగు హోం
సోనూ.. నిన్ను మర్చిపోను అంటున్న అభిమానం

అవును కదా. సినిమాల్లో హీరోల్నే మర్చిపోరు జనం. అలాంటిది రియల్ లైఫ్ హీరోల్ని ఎలా మర్చిపోతారు చెప్పండి. అందుకే ఈ విగ్రహం.. ఓన్లీ విగ్రహమే కాదు. తన సేవల్ని మొత్తాన్ని దించేశారు. ఏదో అభిమానంతో ఒక బొమ్మ పెట్టారులే అని సింపుల్ గా తీసేయకుండా.. తన సేవల్ని మొత్తాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది కదా అభిమానం అంటే అనేలా చేశారు ఆయన ఫ్యాన్స్.

కోల్ కతాలో ఈ విగ్రహాలు వెలిశాయి. బస్సులు, కార్మికులు, ఆయన చేసిన సేవలతో పాటు.. ఆయన విగ్రహం కూడా పెట్టారు. అమ్మవారి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి. అమె కరుణతో నువ్వు పది కాలాల పాటు బతకాలి. నువ్వు బతికి నలుగురినీ బతికించాలి అని కోరుకున్నారు నిర్వాహకులు. ప్రఫుల్లా కనక్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాలు నిలబెట్టారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి చూసిన సోనూ.. నా జీవితంలో దొరికిన అతి పెద్ద పురస్కారం ఇదే అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇంకాస్త వైరల్ అయ్యాయి విగ్రహాల ఫోటోలు.

కరోనా లాక్ డౌన్ టైంలో సోనూ సూద్ చేసిన సేవలు అందరికీ గుర్తే ఉన్నయ్ కదా. లాక్ డౌన్ కారణంగా ఎక్కడెక్కడో లాక్ అయిన కార్మికులందరినీ వాళ్ల సొంత రాష్ట్రాలకి.. సొంతూళ్లకి లగ్జరీ బస్సుల్లో పంపించారు. వాళ్లకి దారి ఖర్చులు అరేంజ్ చేశారు. ఒక్క బస్సు రెండు బస్సులతో ఆగకుండా కావాల్సిన ప్రతి వాళ్లనీ బస్సుల్లో పంపారు. బస్సులు అరేంజ్ అయ్యే దాకా పెద్ద పెద్ద హోటల్స్ లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. విదేశాల్లో లాక్ అయిన వాళ్లని కూడా ఇళ్లకి పంపాడు సోనూ సూద్. అందుకే.. ఆయనకి సినిమాలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ పెరిగిపోయారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top