తెలుగు హోం
టర్కీ కరెన్సీని వైజాగ్ లో అమ్ముతూ..!

విశాఖపట్నం: టర్కీ దేశానికి చెందిన కరెన్సీని ప్రజలకు అమ్ముతున్న ఓ గ్యాంగ్ ను వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు మందిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. వారి వద్ద మొత్తం 300 నోట్లు ఉన్నాయి. 5 లక్షల టర్కిష్ లీరాల విలువ చేసే కరెన్సీని వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 7 మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు.ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకుంది. వీళ్లంతా డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర కలిసే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందింది. మద్దెలపాలెం దగ్గర ఈ లావాదేవీలు చోటు చేసుకోబోతున్నాయని తెలిసి పోలీసులు మాటు వేసి మరీ పట్టుకున్నారు.
వీరు అమ్ముతున్న టర్కీ కరెన్సీ బ్యాన్ చేయబడిందని పోలీసులు తెలిపారు. ఎంవీపీ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రమణయ్య అతడి బృందం ఘటనా స్థలానికి వెళ్లి ఆరుగురిని అరెస్టు చేయడమే కాకుండా ఆ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకుంది. బుజ్జుల రామ స్వామి(33), నంబారి నారాయణ రావు(40), దొమ్మేటి సత్య వెంకట ప్రసాద్ (46), దళాయి యశోద (42), ఇందిలా పృథ్వి రాజ్ (26), మువ్వల ప్రసాద్(32) లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బుజ్జుల రామ స్వామి తనకు రవి అనే వ్యక్తి 300 కరెన్సీ నోట్లను ఇచ్చి భారత కరెన్సీతో మార్చుకుని రమ్మని చెప్పాడని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
ఈ కేసులో ముఖ్య నిందితుడైన రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అతడిని పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నాలను మొదలుపెట్టామని అన్నారు. ఇది చదవండి: డ్రగ్స్ వాడకంలో ఎవరికీ తీసిపోని భారత్..
related stories
-
హోం ఓల్డ్ అల్వాల్లో విద్యార్థిని అదృశ్యం
-
తాజావార్తలు నేరాలకు ఎంటర్నెట్
-
తెలంగాణ వార్తలు డిసెంబర్లోనే స్కెచ్ వేశారు!