తెలంగాణ రాజకీయాలు
తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు

ఏంటేంటి.. ఎట్టెట్టా.. నిజమేనా. అంటే ఏం చెప్పలేం. ఎందుకంటే ఇవి నిజాలేం కావు కదా. కానీ.. తెలంగాణ పాలిటిక్స్ లో మాత్రం దర్శకుడు రాఘవేంద్ర రావు పేరు ఇప్పుడు టామ్ టామ్ అవుతోంది. కేసీఆర్ తో రాఘవేంద్ర రావు సినిమా తీయాలి అనే డిమాండ్ వచ్చింది. అదేంటి.. రామ్ గోపాల్ వర్మా.. రాఘవేంద్ర రావా అనే డౌటేం అక్కర్లేదు. ఈ పాయింట్ లో.. ఈ ఇష్యూలోకి వచ్చిన పేరు రాఘవేంద్ర రావుదే.మరి ఆయనేదో బొడ్డు సీన్లు.. క్లీవేజ్ షాట్ లతో పండగ చేసుకుంటారు కదా. సీఎం కేసీఆర్ ని పెట్టి.. సినిమా తీయడం రాఘవేంద్ర రావుకి ఎలా వర్కవుట్ అవుతుంది. గట్టిగా మాట్లాడితే రామ్ గోపాల్ వర్మ అయితే.. అటో ఇటో లాగించేయగలరు.
ఆల్రెడీ తెలంగాణ టైగర్ అనే మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. అన్నారంటే ఏదో ఒక రోజు సీఎం కేసీఆర్ పై రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తారు కూడా. కానీ.. ఏకంగా సీఎం కేసీఆర్ నే పెట్టి తీయాలి అంటే మాత్రం..
రామ్ గోపాల్ వర్మకి కూడా కొంచెం కష్టమే.. బట్ ట్రై చేస్తే చేయొచ్చు కూడా.ఈ మొత్తం సీన్ లో వర్మ అయితే వర్కవుట్ చేస్తాడు కావచ్చు. కానీ రాఘవేంద్ర రావు ఎలా సినిమా తీస్తారబ్బా అంటే మాత్రం.. ముమ్మాటికీ జరిగే పని కాదు.
సీఎం కేసీఆర్ తో కాదు.. సీఎం కేసీఆర్ లాంటి పోలికలతో ఉన్న వ్యక్తితో కూడా రాఘవేంద్ర రావు సినిమా తీయరు. ఆ విషయంలో ఎవరికీ డౌట్సేం ఉండవు. బట్..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు కదా. ఆయనైతే.. డిమాండ్ చేస్తున్నారు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కానీ.. సీఎం కేసీఆర్ తో సినిమా తీస్తే..
బంపర్ హిట్ అవుతుంది అంటూ పబ్లిక్ గానే కామెంట్ చేశారు. సాధారణంగా బండి సంజయ్ మైక్ అందుకున్నారు అంటే.. ఆ మాటలు కచ్చితంగా సీఎం కేసీఆర్ గురించే ఉంటాయి. ఆ ప్రాసెస్ లో భాగంగానే..
సీఎం కేసీఆర్ తో రాఘవేంద్ర రావు సినిమా తీయాలి. సూపర్ ఉంటుంది. కాకపోతే.. సీఎం ని జోకర్ గా చూపిస్తే ఇంకా బావుంటుంది అంటున్నారు బండి సంజయ్.
అదేంటో.. బండి సంజయ్ కి బొత్తిగా సినిమా నాలెడ్జ్ లేనట్లుంది. ఆయన ఇలాంటి పాలిటిక్స్ సినిమాలు తీసే వారూ కాదు. కామెడీ సినిమాలు తీసే వారూ కాదు.
ఆ విషయం పై బండి సంజయ్ కి ఫుల్ క్లారిటీ లేనట్లే ఉంది.పాపం ఇప్పుడు రాఘవేంద్ర రావు ఈ కామెంట్స్ వింటే రియాక్షన్ ఎలా ఉంటుందా అన్న ఊహే.. జనాలకి కాస్త కొత్తగా ఉంటుంది. నా మానాన నేను ఏజ్ అయిపోయి.. ఎంజాయ్ చేస్తుంటే..
ఈయనేంటయ్యా నా పేరు పాలిటిక్స్ లోకి లాగుతున్నారు. నేను ఈ వయసులో కూడా పదారేళ్ల వయసున్న అమ్మాయిలతో సినిమా తీయమంటే.. తీస్తాను గానీ.. కేసీఆర్ తో నా వల్ల ఏం అవుతుందయ్యా అని నవ్వుకుంటారు కావచ్చు.
related stories
-
తెలంగాణ తాజావార్తలు బ్రాహ్మణులకు, పీవీ కుటుంబంతో విడదీయలేని అనుబంధం ఉంది:ఎర్రబెల్లి
-
ముఖ్యాంశాలు పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?
-
ముఖ్యాంశాలు బాలయ్య గాలి తీసేసిన కొడాలి నానీ