Thursday, 03 Dec, 6.57 am NewsSting

తెలుగు హోం
వైఎస్సార్ విగ్రహమా.. వాజ్ పేయి విగ్రహమా.. ఏది నిలుస్తుంది..?

పురాణాల్లో జరిగిన యుద్ధాలన్నీ ఈగోస్ కోసం జరిగినవే అంటుంటాం కదా. ఈగో చాలా ప్రమాదకరమైంది. ఎంత దాకా అయినా వెళ్తుంది. గెట్టు గొడవలో వందల ఎకరాలు పోగొట్టుకున్న వాళ్లని ఎంత మందిని చూశాం. చరిత్రలన్నీ.. చిన్న చిన్న విషయాల దగ్గర మొదలైనవే. ఎమోషన్స్ ఎంత దూరం అయినా తీస్కెళ్తయ్. ఇప్పుడు పోలవరం దగ్గర కూడా అలాంటి సిచ్చువేషనే రాబోతుంది అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. కేంద్రం చెబుతోన్న మాట..!
పోలవరం దగ్గర వాజ్ పేయి విగ్రహం పెట్టాలి.. అనేది బీజేపీ డిమాండ్. బీజేపీ అంటే సెంట్రల్ సర్కార్ కదా. అదీ కాక.. వాళ్ల పార్టీ లీడర్ గా మాత్రమే కాకుండా.. వాజ్ పేయికి దేశ వ్యాప్తంగా మంచి పేరుంది. ఇండియాకి పదో ప్రధాన మంత్రిగా దేశానికి ఎన్నో సేవలు చేశారు. భారత్ వెలిగిపోతుంది అంటూ.. అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేశారు. వివాదాలకు దూరంగా ఉండే వాజ్ పేయిపై నెగటివిటీ పెద్దగా లేదు. సో.. వాజ్ పేయి విగ్రహం పెట్టాలి అనే డిమాండ్ ఉంది. పోలవరంలో సెంట్రల్ నిధుల వాటా కూడా పెద్దదే.. సో.. మేం చెప్పిన లీడర్ విగ్రహాన్నే పెట్టాలి అనే డిమాండ్ చేయడంలో సెంట్రల్ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గదు. ఇప్పుడే డిమాండ్ చేస్తోంది. ముందు ముందు ఇంకా టైట్ చేస్తుంది. ఏపీ సర్కార్ మాట..!
పోలవరం దగ్గర వైఎస్సార్ విగ్రహం పెట్టాలి.. అనేది వైసీపీ సర్కార్ డిమాండ్. ఇక్కడ కూడా అంతే. వైఎస్సార్ మంచి పేరున్న లీడర్. రైతుల మేలు కోరి.. వారికి ఎంతో అండగా ఉన్న లీడర్ గా పేరుంది. అదీ కాక.. వైఎస్సార్ చిరకాల స్వప్నం పోలవరం అని లీడర్లు ప్రచారం చేస్తున్నారు. అదీ కాక.. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా వైఎస్సార్ తనయుడే.. సో.. ఏపీ సర్కార్ కూడా మంచి పట్టు మీదే ఉంది. జగన్ అయితే.. స్థల సేకరణలో కూడా బిజీగా ఉన్నారు. పోలవరం దగ్గర వైఎస్సార్ విగ్రహం పెట్టే తీరుతాం అంటున్నారు. జగన్ కూడా మొండి మనిషే.. ఏ మాత్రం తగ్గరు. కానీ.. సెంట్రల్ సర్కార్ కి ఎంతో ఫేవర్ గా ఉంటున్న జగన్.. ఫైట్ చేస్తారా అనేది ఆలోచించాలి. అయినా తగ్గుతారా అనేది కూడా నిజమే. ఇక వాజ్ పేయి విగ్రహం కోసం.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో సెంట్రల్ సర్కార్ ఫైట్ చేస్తుందా అనేది కూడా క్వశ్చనే. అదీ కాక.. జగన్ తండ్రి కావడంతో.. ఆ మాత్రం పట్టువిడుపు ఉండదా అనే డౌట్ కూడా ఉంది. కానీ.. వెనక్కి తగ్గితే.. జగన్ గెలిచారు.. సెంట్రల్ సర్కార్ ఓడిపోయింది అనే ప్రచారం జరుగుతుంది అనే పట్టు ఏమైనా ఉంటుందేమో మరి.
చూడాలి.. ముందు ముందు ఈ విగ్రహాల పంచాయితీ ఎక్కడి దాకా వెళ్తుందో.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top