తెలుగు హోం
యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ లో సరికొత్త సమస్యలు

యాపిల్ సంస్థ ఐఫోన్ 12 సిరీస్ ను ఇటీవలే విడుదల చేసింది. అమెరికాలో ఈ మొబైల్ ఫోన్ ను విపరీతంగా కొనుక్కునేశారు. అయితే ఐఫోన్ 12 లో సిగ్నల్స్ సమస్య వస్తోందని ఎన్నో ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఎల్టీఈ, 5జీ నెట్వర్క్ ఒక్కసారిగా డ్రాప్ అవుతోందని అంటున్నారు.. ప్రయాణాల్లో ఉన్న సమయంలో ఈ పరిస్థితి నెలకొందని చెబుతూ ఉన్నారు. అమెరికాలోని ప్రముఖ టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్లైన వెరిజాన్, ఏటీ&టి, టి-మొబైల్ కు చెందిన యూజర్లు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ వాడుతున్న సమయంలో సమస్యలు తలెత్తు తున్నాయని చెబుతూ ఉన్నారు. ఎల్టీఈ, 5జీ నెట్వర్క్ లు ఒక్క సారిగా డ్రాప్ అవుతూ ఉన్నాయని చెబుతూ ఉన్నారు.
ఇతర మొబైల్స్ లో సిగ్నల్స్ అందుతూ ఉన్నా.. ఐఫోన్ 12 సిరీస్ లో మాత్రం సిగ్నల్ డ్రాప్ సమస్య ఉందని చెబుతూ ఉన్నారు. రెడ్డిట్ యూజర్లు తాము ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నామని చెబుతూ వస్తున్నారు. ఐఫోన్ 12 సిరీస్ లో విడుదలైన మొత్తం నాలుగు మోడల్స్ ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ మొబైల్ ఫోన్లకు ఈ సమస్య ఎదురైందని చెబుతూ ఉన్నారు.ఒక లొకేషన్ నుండి మరొక లొకేషన్ కు వెళుతున్న సమయంలో ఈ సమస్యలను తాము ఎదుర్కొన్నామని పలువురు వెల్లడించారు.
ఒకటే రోజు ఏకంగా 14 సార్లు నెట్వర్క్ డ్రాప్ సమస్య ఎదురైందని చెబుతూ ఉన్నారు. ఒకటే నగరంలో ఉన్నా కూడా పలు ప్రాంతాలకు వెళుతున్న సమయంలో ఇలా నెట్వర్క్ డ్రాప్ జరిగిందని అంటున్నారు. ఈ సమస్యపై యాపిల్ సంస్థ ఏమని స్పందిస్తుందో చూడాలి.