Friday, 29 Nov, 5.26 pm News18 తెలుగు

హోమ్
Mi Credit: అప్పు కావాలా? షావోమీ ఇస్తుంది... డిసెంబర్ 3న 'ఎంఐ క్రెడిట్' లాంఛ్

మీకు అప్పు కావాలా? ఎక్కడికి వెళ్లినా అప్పు దొరకట్లేదా? ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన షావోమీ... త్వరలో అప్పులు కూడా ఇవ్వనుంది. ఇందుకోసం షావోమీ పర్సనల్ లోన్ ప్లాట్‌ఫామ్ 'ఎంఐ క్రెడిట్' సర్వీస్‌ను డిసెంబర్ 3న లాంఛ్ చేయబోతోంది. షావోమీ అంటే ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్లు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఆ తర్వాత స్మార్ట్ టీవీలు, పవర్ బ్యాంక్, ఇయర్ ఫోన్స్ లాంటి మొబైల్ యాక్సెసరీస్, ఎయిర్ ప్యూరిఫైర్స్ లాంటి ప్రొడక్ట్స్‌ని ఇండియాకు పరిచయం చేసింది. ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోకి అడుగుపెడుతోంది. 'ఎంఐ క్రెడిట్' ద్వారా యూజర్లకు లోన్స్ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. కొన్నాళ్ల క్రితమే 'ఎంఐ క్రెడిట్' యాప్ లాంఛ్ చేసింది షావోమీ. ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్‌ని అధికారికంగా ప్రారంభించనుంది.

ఎంఐ క్రెడిట్ ద్వారా రూ.1,00,000 వరుకు లోన్ తీసుకోవచ్చు. అయితే రుణం తీసుకునేవారి వయస్సు 18 ఏళ్లపైబడి ఉండాలి. తీసుకున్న అప్పును 91 రోజుల నుంచి 3 ఏళ్ల లోపు తిరిగి చెల్లించాలి. వడ్డీ నెలకు 1.35% ఉంటుంది. ప్లేస్టోర్‌లో ఎంఐ యాప్ డిస్క్రిప్షన్‌లో ఉన్న సమాచారం ప్రకారం ఉదాహరణకు రూ.20,000 లోన్ తీసుకుంటే ఏడాదికి 16.2% వడ్డీ చొప్పున లెక్కిస్తారు. 6 ఈఎంఐలల్లో చెల్లించాలి. వడ్డీ రూ.937 అవుతుంది. ఈఎంఐ రూ.3423 చొప్పున చెల్లించాలి. లోన్ తీసుకుంటే 1.99%+జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎంఐ క్రెడిట్ యాప్‌లో రూ.1,200 విలువైన మీరు క్రెడిట్ రిపోర్ట్, ఎక్స్‌పీరియెన్ రిపోర్ట్ ఉచితంగా పొందొచ్చు.
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌లో Mi Credit యాప్‌ డౌన్‌లోడ్ చేయాలి.
మీ ఎంఐ అకౌంట్ లేదా ఫోన్ నెంబర్‌తో రిజిస్టర్ చేయాలి.
ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి కేవైసీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ వెరిఫికేషన్ పూర్తవుతుంది.ఆ తర్వాత మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత మీరు లోన్‌కు అప్లై చేయొచ్చు.
మీ అర్హతను బట్టి రూ.1,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు.
రుణం మంజూరైన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు జమ అవుతాయి.

యాప్ ద్వారా అప్పులు ఇచ్చే ఫిన్ టెక్ కంపెనీలు ఇండియాలో చాలానే ఉన్నాయి. ఇప్పుడు వాటికి పోటీగా వస్తోంది షావోమీ ఎంఐ క్రెడిట్.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News18 Telugu
Top