Tuesday, 02 Mar, 9.00 pm NewsOrbit

హోం
Circumambulation: శివాలయం చుట్టూ ప్రదక్షిణము ఎందుకు చెయ్యకూడదు??

Circumambulation: మన సనాతన హిందూ సంప్రదాయాలలో ఎన్నో విశ్వాసాలు వాటి వెనుక మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనకి ఈ ఆచారాల వెనుక ఉన్న కారణం తెలియకపోయినా చాలా వరకు పాటిస్తూ ఉంటాము. అలా ఫలితం తెలియకుండా పాటించినా వాటి వలన మంచే తప్ప చెడు జరగదు. కానీ ఈ తరంలో ఆ ఆచారాలు, సంప్రదాయాలు అన్ని కనుమరుగైపోతున్నాయి. సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం కన్నా ముందు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అన్ని గుడులలో ప్రదక్షిణ చేయవచ్చు కానీ ఒక్క శివాలయంలో మాత్రం ప్రదక్షిణ చేయకూడదు.

We shouldn’t do Circumambulation in Shivalayam

మన పెద్దలు ఈ మాట చెప్పడానికి వెనుక కారణం ఉంది. అదేమిటంటే.. మన హిందూ సంప్రదాయంలో గుడి ప్రదక్షిణములు పాపనాశములని మన పెద్దలు తెలిపారు. కానీ శివాలయానికి విషయంలో మాత్రం శివాలయం చుట్టూ ఒక్క ప్రదక్షిణము కూడా చేయరాదని వారే తెలిపారు. ఈ ఆచారం వెనుక ఉన్న కారణం ఏమిటంటే….

పరమేశ్వరుడైన శివుడు దేవతలకే దేవుడు. అతడి గుడి చుట్టూ ప్రదక్షిణాన్ని చేయడం వలన శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది అనే భావనతో అలా తెలుపబడినది. శివుడి వైభవాన్ని తక్కువ చేయడం సరైనది కాదు. అలాగే పరమేశ్వరుడి తల పై నుండి జాలువారు పవిత్ర గంగ గుడి లోని శివలింగాన్ని అభిషేకించి పీఠం పై నుండి కింద ఏర్పాటు చేసిన కాలువ ద్వారా బైటకు ప్రవహిస్తుంది అని ఋషులు విశ్వసించారు. భక్తులు ప్రదక్షిణము చేసినప్పుడు ఈ పవిత్ర గంగను దాట వలసి వస్తుంది. కాబట్టి శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయకూడదని మన పెద్దలు చెప్పారు. ఈ కారణం చేత శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం నిషేదించడమయినది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

The post Circumambulation: శివాలయం చుట్టూ ప్రదక్షిణము ఎందుకు చెయ్యకూడదు?? first appeared on News Orbit.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: NewsOrbit
Top