Corona: కరోనా కల్లోలం నేపథ్యంలో ఎదురవుతున్న అనేకానేక సమస్యల్లో మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి అదుపు చేసేందుకు గత ఏడాది జాతీయ స్థాయిలో అమలు చేసిన లాక్‌డౌన్ షాకింగ్ ఫలితాలు ఇస్తోంది. ఈ లాక్ డౌన్ వల్ల ఏకంగా నాలుగు దశాబ్దాలకుపైగా కనిష్ఠానికి పతనమవుతూ గత ఆర్థిక సంవత్సరం (2020-21) జీడీపీ మైనస్ 7.3 శాతంగా నమోదైంది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. అయితే, ఈ సమయంలో ఓ ఆశ్చర్యకర విశ్లేషణ వెలుగులోకి వచ్చింది.
Read More: Corona: షాక్ఃకరోనా టీకా పనిచేయడం లేదని కేసు పెట్టాడు
కోవిడ్ కష్టాలు మాటల్లో చెప్పలేం…
గత ఏడాది జనవరి-మార్చిలో 3 శాతంగా, అక్టోబర్-డిసెంబర్‌లో 0.5 శాతంగా జీడీపీ నమోదైంది. అంతకుముందు రెండు త్రైమాసికాల్లో జీడీపీ మైనస్‌కే పరిమితమవగా, మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు వచ్చింది కేవలం ద్వితీయార్ధంలోనే వచ్చాయి.
No Internet connection |