NewsOrbit
57k FollowersCorona: ఇప్పుడంతా కరోనా భయమే. కరోనా నిర్ధారణ పరీక్షలు , ఫలితాల విషయంలో ఎంతో నిరీక్షణ ఉంటోంది. ఈ పరీక్షల్లో సీటీ స్కానింగ్ కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్, సీటీ స్కానింగ్ సదుపాయాలు తక్కువ. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ సిటీ స్కానింగ్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ బయటపడ్డ దాఖలాలు ఉన్నాయి. అయితే, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా వాట్సాప్‌తో కరోనా టెస్ట్ సులభంగా చేసుకునే టెక్నాలజీకి మన యువ ఇంజినీర్ ఆవిష్కరించారు.
Read More: Corona: షాక్ః పక్క రాష్ట్రంలో కొత్త రకం కరోనా కేసు
ఇది బ్యాక్ గ్రౌండ్…
బెంగళూరుకు చెందిన ఆర్ట్కార్ట్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసింది.
Read More: Corona: డబ్బులు ప్రింట్ చేసుకుంటే సమస్యే ఉండదు. కరోనా సమయంలో భలే విశ్లేషణ
10-15 నిమిషాల్లో ఫలితం….
గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు ఆర్ట్పార్క్ సీఈవో ఉమాకాంత్ సోని చెప్పారు. వైద్యులు ఎక్స్‌రేల ఫొటోలను వాట్సాప్ ద్వారా www. xraysetu.com వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది. ఇది కొవిడ్‌తో పాటు టీబీ, న్యుమోనియా లాంటి 14 రకాల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను గుర్తించగలదు. ఇండియాలో 1000 మందికిపైగా కరోనా రోగులపై ఈ పరిశోధనలు నిర్వహించారు. ఇప్పటివరకు 500 మంది డాక్టర్లు సేవలను వినియోగించుకొన్నారని పేర్కొన్నారు. వచ్చే 15 రోజుల్లో 10వేల మంది వైద్యులకు ఈ సాంకేతికత అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
వాట్సాప్ ద్వారా ఇలా …
– www. xraysetu.com లోకి డాక్టర్ లాగిన్ అయి ఎక్స్రేసేతు బీటా బటన్‌పై క్లిక్ చేయాలి.
– వాట్సాప్ చాట్‌బాక్స్ ఓపెన్ అయిన తర్వాత +91 80461638638 నంబర్‌కు వైద్యుడు వాట్సాప్ చేయాలి.
– ఎక్స్‌రే సేతు సర్వీస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైద్యుడు రోగి ఎక్స్‌రేను వాట్సాప్ చేయాలి.
– అనంతరం 10-15 నిమిషాల్లో రోగి యొక్క ఆరోగ్య స్థితికి సంబంధించిన ఫలితం తెలుస్తుంది.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: NewsOrbit