Wednesday, 03 Mar, 7.30 pm NewsOrbit

హోం
David Warner : రజినీకాంత్ గా మారిన డేవిడ్ వార్నర్..!!

David Warner : ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలియని వారు ఉండరు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ .. ఆస్ట్రేలియా టీమ్ లో ఓపెనర్ గా మాత్రమే కాక ఐపీఎల్ లో తనదైన శైలిలో సత్తాచాటిన డేవిడ్ వార్నర్ లాక్ డౌన్ సమయంలో.. ఇండియన్ ఫిలిం ప్రేమికుల క్రేజ్ భారీ స్థాయిలో దక్కించుకున్నాడు. ఆ టైంలో టిక్ టాక్ ద్వారా లేకపోతే వీడియో యాప్ ద్వారా అనేక మంది ప్రముఖులు హీరోల సినిమాల పాటలకు స్టెప్పులు వేస్తూ తనదైన శైలిలో భారతీయ చలనచిత్ర ప్రేమికులను అలరించాడు.

David Warner becomes Rajinikanth .. !!

సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన వీడియోలు మరియు పాటలకు తనదైన శైలిలో స్టెప్పులు ఫేస్ యాప్ ద్వారా వీడియోలు క్రియేట్ చేసి డేవిడ్ వార్నర్ అలరించడం జరిగింది. కాగా తాజాగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ మొహాన్ని ఫేస్ యాప్ ద్వారా.. ఆయన ని ఇమిటేట్ చేస్తూ..రజనీకాంత్ నటించిన పలు సినిమాలోని డైలాగులను .. తనదైన శైలిలో డేవిడ్ వార్నర్ పలికించాడు. దీంతో డేవిడ్ వార్నర్ తాజాగా చేసిన ..

వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోల డైలాగులు మరియు పాటలకు స్టెప్పులు వేయడంతో సోషల్ మీడియాలో .. వార్నర్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. చాలావరకు డేవిడ్ వార్నర్ క్రికెటర్ గా కంటే. ఇటువంటి వీడియోలు చూస్తూ ఎక్కువ పాపులర్ అవుతున్నట్లు నెటిజన్ల నుండి టాక్ వస్తోంది. వార్నర్ చేసే ప్రతి వీడియో భారీ స్థాయిలో వ్యూస్ సాధించటం ఇందుకు నిదర్శనం అని అంటున్నారు.

The post David Warner : రజినీకాంత్ గా మారిన డేవిడ్ వార్నర్..!! first appeared on News Orbit.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: NewsOrbit
Top