హోం
దూసుకెళ్తున్న మారుతి స్విఫ్ట్..!! మరో మైలురాయిని అధిగమించింది..!!

భారతదేశంలో ఎన్ని వాహన తయారీ సంస్థలు ఉన్నప్పటికీ మారుతీ maruti స్థానం ప్రత్యేకం.. కారు కొనాలనుకునే కస్టమర్ల ఎంపికలో మారుతీ ముందుంటుంది.. అత్యంత అధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్లలో మారుతి స్విఫ్ట్ ఒకటి.. ఈ మోడల్ కారు మార్కెట్లో విడుదలై 15 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా సేల్స్ లో టాప్ గేర్ లో maruti swift దూసుకెళ్తోంది.. మారుతి 2.3 మిలియన్ యూనిట్లకు పైగా స్విఫ్ట్ కార్లను విక్రయించినట్లు ప్రకటించింది..!!
Maruti swift 2.3 milion sales record reached on another milestone2020 సంవత్సరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మారుతి స్విఫ్ట్ సుమారుగా 1,60,700 అమ్మకాలను సాధించని కంపెనీ బెస్ట్ అమ్మకాలు నమోదు చేసినట్లు తెలిపింది.2005 లో మొదటి సారిగా మారుతి స్విఫ్ట్ ను భారత్ మార్కెట్లో పరిచయం చేశారు.దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి స్విఫ్ట్ దూసుకెళ్తోంది. తాజాగా భారత్ మార్కెట్లో న్యూ మారుతీ స్విఫ్ట్ New Maruti swift త్వరలో మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది..ఈ కొత్త స్విఫ్ట్ 12 వేరియంట్స్, 6 రంగుల్లో లభిస్తుంది. సరికొత్త ఇంజన్ తో అప్డేటెడ్ ఫీచర్స్ , లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్స్ తో కస్టమర్లను మరింతగా అలరించనుంది..

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, మారుతి సుజుకి స్విఫ్ట్ 15 సంవత్సరాలుగా 2.3 మిలియన్లకు పైగా కస్టమర్లతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్బ్యాక్ అని తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్నపటికి మారుతి స్విఫ్ట్ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు నమోదు చేసింది. కస్టమర్ అభిమానానికి కృతజ్ఞతలు, నిరంతరం కస్టమర్ మద్దతుతో మారుతి స్విఫ్ట్ భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లను విజయవంతంగా సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.
The post దూసుకెళ్తున్న మారుతి స్విఫ్ట్..!! మరో మైలురాయిని అధిగమించింది..!! first appeared on News Orbit.