హోం
సీఎం వైఎస్ జగన్ తో పంచాయతీ ఉన్నతాధికారుల భేటీ..ఎందుకంటే..!!

ఓ పక్క రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిలువరించడానికి ప్రభుత్వం సర్వశక్తులను ఒడ్డుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేగవంతం చేశారు. ఎన్నికల నిలుపుదలకు ప్రభుత్వం సుప్రీం కోర్టు ద్వారా ఉన్న అవకాశాలను పరిశీలన చేస్తుంది. మరో పక్క ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమంటూ ప్రకటన ఇచ్చారు. తాము కోర్టును ఆశ్రయిస్తామంటూ ఆ సంఘాలు పేర్కొంటున్నాయి.
ap panchayati raj chief secretary dwivedi meet cm ys jaganఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఈ సాయంత్రం ఎస్ఈీసీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాలు అన్ని గవర్నర్ కు వివరించి ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘానికి సహకరించే విధంగా సూచించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో బేటీ అయ్యారు. ఈ సాయంత్రం ఎస్ఈసీతో సమావేశంలో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో వీరు సీఎం జగన్ తో బేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసి చర్చించారు.
The post సీఎం వైఎస్ జగన్ తో పంచాయతీ ఉన్నతాధికారుల భేటీ..ఎందుకంటే..!! first appeared on News Orbit.related stories
-
జిల్లా వార్తలు అందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలి
-
హెరాల్డ్ కార్డ్స్ కృష్ణా: తాడేపల్లిలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం. హాజరైన మంత్రులు...
-
హోమ్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష..