భారత్‌లో అతిపెద్ద ఐటీ కంపెనీలుగా పేరున్న టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies), విప్రో (Wipro) సంస్థలు భారీగా ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. కరోనా తరువాత ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ నాలుగు కంపెనీలు కలిపి సుమారు 91,000 మందిని క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా నియమించుకునే అవకాశం ఉంది.

