Monday, 14 Jun, 4.03 pm న్యూ తెలుగు న్యూస్

హోమ్
అపోలో హాస్పిటల్స్‌ యజమానికి కరోనా

తనకు ఈనెల 10వ తేదీన కరోనా సోకిందని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతా రెడ్డి వెల్లడించారు. తనకు కరోనా రావడంపై ఆమె ఆశ్చర్యం వక్తం చేశారు. దాదాపు 500 రోజుల నుంచి కరోనా తప్పించుకున్న తనకు ఈనెల 10న కరోనా సోకిందన్నారు. తను చాలా జాగ్రత్తగా ఉంటానని, వ్యాక్సినేషన్‌ కూడా వేయించుకున్నానని ఆమె పేర్కొన్నారు. అయినా అధిక జ్వరం రావడంతో హాస్పిటల్‌లో చేరానని ఆమె ట్వీట్‌ చేశారు. ఆరంభంలోనే రిజెనెరాన్‌ కాక్‌టైల్‌ థెరపీ తీసుకున్నానని,దీని వల్ల చాలా వరకు కోలుకున్నానని ఆమె అన్నారు. తన విషయంలో గమనించాల్సిన చాలా ముఖ్యమైన అంశం. వ్యాక్సిన్‌ కరోనాను ఆపలేకపోయినా. లక్షణాలు చాలా తక్కువగా ఉండేలా చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. వెంటనే కరోనాను గుర్తించడం, చికిత్స తీసుకోవడం వల్ల త్వరగా ఈ వ్యాధి నుంచి కోలుకోవడం సాధ్యమౌతుందన్నారు. ఇవాళ తాను హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అవుతున్నానని, హోం ఐసోలేషన్‌లో ఉంటానని అన్నారు. ఈ సందర్బంగా చికిత్స సమయంలో తనకు సాయం చేసిన నర్సులు, డాక్టర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com
Top