Sunday, 11 Apr, 11.29 am న్యూ తెలుగు న్యూస్

క్రీడలు
పృథ్వీషాని వెరైటీగా పొగిడిన సెహ్వాగ్.. పోస్ట్‌లోతనతో పాటు సచిన్, లారా ఉన్న ఫోటో..

యువ ఓపెనర్ పృథ్వీషా కు గత ఏడాది ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటన చేదు అనుభవాలనే మిగిల్చింది. అడిలైడ్‌లో ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన పృథ్వీషా ఆ తరువాత టీం ఇండియా నుండి తప్పుకున్నాడు. అయితే వెంటనే పృథ్వీషా తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. పృథ్వీషా దేశీయ క్రికెట్‌కు తిరిగి వచ్చి ఫామ్‌లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో రికార్డు స్తాయిలో 827 పరుగులు చేశాడు.ఇక చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన శనివారం మ్యాచ్‌లో దుమ్ములేపాడు. పృథ్వీషా శిఖర్ ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు 138 పరుగులు జోడించాడు. పృథ్వీషా కేవలం 38 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేటు 189.47. ఇక తన ఇన్నింగ్స్‌లో అతను తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు.

మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పృథ్వీషా ఇన్నింగ్స్‌ను వెరైటీ గా ప్రశంసించాడు. సెహ్వాగ్ ట్విట్టర్ లో ఒక ఫోటో షేర్ చేయడం ద్వారా పృథ్వీషా ను ప్రశంసించాడు. ఈ ఫోటోలో, సచిన్ టెండూల్కర్ మరియు బ్రియాన్ లారా సెహ్వాగ్‌తో కలిసి కనిపిస్తారు. 2018 లో వెస్టిండీస్‌పై పృథ్వీషా తన టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించినప్పుడు.. ఇండియా కోచ్ రవిశాస్త్రి పృథ్వీషా బ్యాటింగ్‌లో కొద్దిగా సచిన్, కొద్దిగా వీరు ఉన్నారు ఇక అతను నడుస్తున్నప్పుడు, కొద్దిగా లారా కూడా అతనిలో కనిపిస్తాడు, అని అప్పట్లో అనగా రవిశాస్త్రిని తీవ్రంగా ట్రోల్ చేశారు.. ఈ రోజు షా వారికీ సమాధానం చెప్పాడు అనే ఉద్దేశంతో సెహ్వాగ్ ఈ ఫోటో షేర్ చేశాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com
Top