గతంలో 20 గంటలు పని చేసిన కోట శ్రీనివాసరావు ఇప్పుడు ఖాళీగా కూర్చోవడం నచ్చడం లేదంటున్నారు. కానీ తనకి వయసైపోయింది అని, తన ఆరోగ్యం బాగోలేదని తనకి అవకాశాలు ఇవ్వడం లేదని, కానీ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా అని, మోకాళ్ళ నొప్పులు తప్ప తనకెలాంటి ఇబ్బందులు లేవంటున్న కోట శ్రీనివాసరా రావు లాక్ డౌన్ టైం లో ఖాళీగా కూర్చిపోలేకపోయా అని, లాక్ డౌన్ ముగిసాక కూడా ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు. అదే విషయాన్ని మీడియా ముఖంగా చెబుతున్నారు కూడా. తనకి డబ్బు, పారితోషకాలు ముఖ్యం కాదని వేషాలు ముఖ్యమంటున్నాడాయన. అందుకే మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో పాటుగా వి. వి .వినాయక్, త్రివిక్రమ్ లాంటి దర్శకులకు ఫోన్ చేసి అవకాశాల కోసం అడిగా అని చెబుతున్నారాయన.
అయితే రీసెంట్ గా కోట గారు పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న PSPK 27 లో నటిస్తున్నట్లు చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ తో నటించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. కాకపోతే తెలుగు రాని నటులని తెలుగులోకి తీసుకొచ్చి.. గౌరవం ఇస్తూ.. ఇక్కడ మంచి నటీనటుల్ని పక్కన బెట్టడం తనకి నచ్చలేదంటూ మొహమాటం లేకుండా చెబుతున్నారు కోటా.

