Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్మీ జవాన్ vs పోలీస్ కానిస్టేబుల్..! "నా భార్యను కిడ్నాప్ చేశాడు".. కిడ్నాప్ కేసులో అనూహ్య మలుపు..  షాక్ ఇచ్చిన భార్య..!!

ఆర్మీ జవాన్ vs పోలీస్ కానిస్టేబుల్..! "నా భార్యను కిడ్నాప్ చేశాడు".. కిడ్నాప్ కేసులో అనూహ్య మలుపు.. షాక్ ఇచ్చిన భార్య..!!

బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఆర్మీలో పనిచేస్తున్న దేవదర్శన్ అనే జవాన్‌కు, అదే రాష్ట్ర పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సన్నీకి మధ్య నెలకొన్న వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఏం జరిగింది? తన భార్య జాన్విని కానిస్టేబుల్ సన్నీ ఆశ చూపి కిడ్నాప్ చేశాడని ఆర్మీ జవాన్ దేవదర్శన్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ జవాన్ భార్యను ఒక పోలీసే కిడ్నాప్ చేశాడనే ఆరోపణ పోలీసు శాఖలో కలకలం రేపింది. అయితే, ఇప్పుడు ఈ కేసులో జవాన్ భార్య జాన్వి విడుదల చేసిన వీడియో స్టేట్‌మెంట్ మొత్తం కథను తలకిందులు చేసింది.

భార్య క్లారిటీ: తన భర్త చేసిన ఆరోపణలను జాన్వి పూర్తిగా ఖండించింది. ఆ వీడియోలో తన భర్త దేవదర్శన్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. "ఆర్మీ జవాన్ దేవదర్శన్‌తో నాకు బలవంతంగా కోర్టు వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి ఆయన నన్ను మానసికంగా, శారీరకంగా హింసించేవారు. నాపై ఎన్నో ఆంక్షలు విధించారు. దీంతో భరించలేక, నా సొంత ఇష్టంతోనే నేను ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసాను. ఇక ఏ పరిస్థితిలోనూ, ఎలాంటి పరిణామం ఎదురైనా నేను తిరిగి ఆయన దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదు" అని జాన్వి ఆ వీడియోలో స్పష్టం చేసింది. భార్య విడుదల చేసిన ఈ వీడియోతో ఈ కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com