Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"అరెరే.. ఇది మన ఆంధ్రా ఆవా..?" భారత్ నుంచి తరలించిన జాతా..? ఒక్క ఆవును అమ్మితే 10 బంగ్లాలు కొనొచ్చు.. రూ.35 కోట్లకు అమ్ముడైన ప్రపంచ రికార్డు ఆవు..!!

"అరెరే.. ఇది మన ఆంధ్రా ఆవా..?" భారత్ నుంచి తరలించిన జాతా..? ఒక్క ఆవును అమ్మితే 10 బంగ్లాలు కొనొచ్చు.. రూ.35 కోట్లకు అమ్ముడైన ప్రపంచ రికార్డు ఆవు..!!

ప్రపంచంలోనే అత్యధిక ధరకు వేలం పాడిన ఆవుగా బ్రెజిల్‌కు చెందిన 'వయాటినా-19' (Viatina-19) అనే ఆవు సరికొత్త రికార్డు సృష్టించింది.

దీని మొత్తం మార్కెట్ విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.35 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

బ్రెజిల్‌లో జరిగిన వేలంలో, ఈ ఆవుకు సంబంధించిన కేవలం మూడో వంతు (1/3) వాటా హక్కే దాదాపు 11 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

ఇంతటి భారీ ధరకు అమ్ముడైన ఈ ఆవు విశిష్టమైన 'ఒంగోలు' (Nellore) జాతికి చెందినది. " ఒంగోలు అనే పేరు మన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నుంచి వచ్చిందే. ఎన్నో ఏళ్ల క్రితం భారతదేశం నుంచి బ్రెజిల్‌కు తీసుకెళ్లిన ఈ పశువుల జాతి, నేడు బ్రెజిల్ మాంస, పాల పరిశ్రమలలో అత్యంత కీలకమైన స్థానాన్ని దక్కించుకుంది.

ఒంగోలు జాతి పశువులు తీవ్రమైన ఎండను, వేడి వాతావరణాన్ని సైతం తట్టుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మెరిసే తెల్లటి శరీర ఛాయ, మందపాటి చర్మం మరియు అధిక స్వేద గ్రంథులు ఉండటం వల్ల కీటకాలు, ఇన్ఫెక్షన్ల బారిన ఇవి త్వరగా పడవు. మూపురం పెద్దదిగా ఉండటం, వదులుగా ఉండే చర్మం ఈ జాతి ముఖ్య లక్షణాలు.

బ్రెజిల్‌లో ఈ ఆవులు వాణిజ్యపరంగా మరియు వేలం విలువల పరంగా గుర్తింపు పొందినప్పటికీ, భారతదేశంలో ఆవులు ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్న పవిత్రమైన 'గోమాత'గా పూజలందుకుంటున్నాయి. గ్రామీణ ప్రజలకు ప్రధాన జీవనాధారంగా నిలుస్తున్న గోవులు, పాల ఉత్పత్తులను అందించడమే కాకుండా ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఎరువును కూడా అందిస్తున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా బ్రెజిల్‌లోని ఒంగోలు జాతి ఆవు రికార్డు సృష్టించినప్పటికీ, దాని మూలాలు భారత గడ్డపైనే ఉండటం ప్రతి భారతీయుడికీ గర్వకారణం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com