Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్యాభర్తల గొడవ.. 11 నెలల పసికందును కొట్టి చంపిన తల్లిదండ్రులు! పోస్టుమార్టం నివేదికలో వెలుగుచూసిన హృదయ విదారక నిజం..!

భార్యాభర్తల గొడవ.. 11 నెలల పసికందును కొట్టి చంపిన తల్లిదండ్రులు! పోస్టుమార్టం నివేదికలో వెలుగుచూసిన హృదయ విదారక నిజం..!

బెంగళూరు: భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్ర గొడవ కారణంగా, వారి 11 నెలల పసికందును కొట్టి చంపిన అమానుష ఘటన బెంగళూరులో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

బిడ్డను హత్య చేసిన తండ్రి శెక్కప్ప మరియు తల్లి విజయలక్ష్మి ఇద్దరూ, తాము చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక నాటకమాడారు. పసికందు అనుకోకుండా మంచంపై నుండి కింద పడటంతోనే మరణించిందని నమ్మించే ప్రయత్నం చేశారు.

అయితే, బిడ్డ మరణంపై అనుమానం రావడంతో జరిపిన పోస్టుమార్టం పరీక్షలో అసలు నిజం బయటపడింది. శిశువు శరీరంలో తీవ్రమైన అంతర్గత గాయాలు మరియు ఎముకలు విరిగినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా నిర్ధారణ అయ్యింది. తల్లిదండ్రుల గొడవకు అభం శుభం తెలియని పసికందు బలైపోయిన ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తండ్రి శెక్కప్ప మరియు తల్లి విజయలక్ష్మిలను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com