Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దిగ్భ్రాంతి. టీచర్‌ను బడి గేటు వద్దకే పిలిచి గొంతు కోసి హత్య. మాజీ విద్యార్థి ఉన్మాదం. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు.!!

దిగ్భ్రాంతి. టీచర్‌ను బడి గేటు వద్దకే పిలిచి గొంతు కోసి హత్య. మాజీ విద్యార్థి ఉన్మాదం. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు.!!

ర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా ప్రాంతంలో జూన్ 29న ఉదయం 9:30 గంటల సమయంలో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది.

పాఠశాలకు వచ్చిన ఒక వ్యక్తి, అక్కడ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సంధ్య అనే ఆమెను కలవాలని చెప్పాడు.

సంధ్య పాఠశాల ప్రవేశ ద్వారం వద్దకు రాగానే, ఆమెను ఉపాయంతో బయటకు రప్పించిన ఆ వ్యక్తి, తాను దాచి ఉంచిన కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి పొడిచాడు.

ఆ సమయంలో సమీపంలో ఉన్న మరొక వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నించగా, హంతకుడు కత్తి చూపించి అతనిని కూడా బెదిరించి వెనక్కి తగ్గేలా చేశాడు. ఆ తర్వాత, సంధ్య గొంతు భాగంలో మళ్లీ దారుణంగా పొడిచి అక్కడి నుండి పరారయ్యాడు. రక్తపు మడుగులో తీవ్రంగా గాయపడిన సంధ్యను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడికి పాల్పడిన వ్యక్తి ఆ పాఠశాల మాజీ విద్యార్థి అయిన అమిత్ అని గుర్తించి అతనిని అరెస్టు చేశారు. అమిత్, టీచర్ సంధ్యను ప్రేమిస్తున్నానని చెబుతూ నిరంతరం వేధింపులకు గురిచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ పాఠశాలలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com