Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దిగ్భ్రాంతికరం: భార్యను కత్తితో పొడిచి చంపి.. కిందపడి చనిపోయిందంటూ భర్త నాటకం.. మద్యం మత్తులో జరిగిన ఘోరం.!!

దిగ్భ్రాంతికరం: భార్యను కత్తితో పొడిచి చంపి.. కిందపడి చనిపోయిందంటూ భర్త నాటకం.. మద్యం మత్తులో జరిగిన ఘోరం.!!

చెన్నై సమీపంలోని కొలత్తూరు అన్నై సత్య నగర్‌కు చెందిన కూలీ శరణ్‌రాజ్, ముత్తుమారియమ్మాళ్ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

గత కొద్ది నెలలుగా ఎటువంటి పనికీ వెళ్లకుండా తాగుడుకు బానిసైన శరణ్‌రాజ్, ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు.

నిన్న రాత్రి కూడా ఎప్పటిలాగే మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న శరణ్‌రాజ్‌కు, అతని భార్యకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన శరణ్‌రాజ్, కూరగాయలు కోసే కత్తితో ముత్తుమారియమ్మాళ్ ఛాతీపై విచక్షణారహితంగా పొడవడంతో, ఆమె రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఆ తర్వాత భార్య కిందపడి చనిపోయిందంటూ నాటకమాడిన శరణ్‌రాజ్, 108 అంబులెన్స్‌ను పిలిపించి మోసం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే పరిస్థితిని గమనించిన నర్సింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో కొలత్తూరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కీల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, హంతకుడు శరణ్‌రాజ్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com