Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"ఏమే.. పుస్తకం తీసుకురాలేదా?". 7వ తరగతి విద్యార్థినిని బాత్రూంలో బంధించి చిత్రహింసలు పెట్టి చంపిన కిరాతక టీచర్.. ఢిల్లీని కుదిపేసిన దిగ్భ్రాంతికర ఘటన!

"ఏమే.. పుస్తకం తీసుకురాలేదా?". 7వ తరగతి విద్యార్థినిని బాత్రూంలో బంధించి చిత్రహింసలు పెట్టి చంపిన కిరాతక టీచర్.. ఢిల్లీని కుదిపేసిన దిగ్భ్రాంతికర ఘటన!

ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలోని సర్వోదయ కన్యా బాల్ విద్యాలయ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అవని అనే విద్యార్థిని, పాఠ్యపుస్తకం తీసుకురాలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు ఆమెను ఎండలో నిలబెట్టి, కొట్టి, బాత్రూంలో బంధించింది.

దీంతో ఆ బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించగా, ఐదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందుతూ ఆమె దయనీయంగా ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటన అనంతరం బాలిక అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఈ ఘటనపై విద్యాశాఖ డైరెక్టరేట్ ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది.

చదువుకోవడానికి బడికి వెళ్లిన బాలికకు ఎదురైన ఈ విషాద ఘటన, ఉపాధ్యాయుల హింసాత్మక ప్రవర్తనను, బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపడంతో పాటు విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతను నిర్ధారించాల్సిన అవసరాన్ని మరోసారి గట్టిగా గుర్తుచేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com