లైఫ్ స్టైల్ టిప్స్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ప్రతిరోజూ ఎంతోమందిని కలుస్తుంటాం. ఆఫీసు పనుల కోసమో లేదా వ్యక్తిగత కారణాల వల్లనో పది మందితో గడపాల్సి వస్తుంది.
మనం కలిసే ప్రతి వ్యక్తి తమదైన ఆలోచనలు, ఎనర్జీని (శక్తిని) మోసుకొస్తుంటారు. వారి ఆలోచనలు, ఎనర్జీ మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తెలియకుండానే మనం ఇతరుల నెగటివ్ ఎనర్జీని మనలోకి పీల్చుకుంటూ ఉంటాం. దీనివల్ల మన మానసిక స్థితి, ఆలోచనలు మరియు ఆరోగ్యం దెబ్బతింటాయి. మీరు కూడా ఇతరుల నెగటివ్ ఎనర్జీని గ్రహిస్తున్నారా లేదా అనేది ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి.
- కారణం లేకుండా అలసట: ఉదయం నిద్రలేచినప్పుడు బాగున్నా, కొందరిని కలిసిన తర్వాత లేదా కొంతమంది మధ్య గడిపిన తర్వాత మీకు అకస్మాత్తుగా నీరసంగా అనిపిస్తే, అది నెగటివ్ ఎనర్జీ ప్రభావం కావచ్చు. అటువంటి సందర్భాల్లో, కొంత సమయం మీ కోసం కేటాయించుకుని, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ పాజిటివ్ విషయాలపై దృష్టి పెట్టండి.
- చిన్న విషయాలకే మూడ్ ఆఫ్ అవ్వడం: ఇతరుల నెగటివిటీని మీరు ఎక్కువగా తీసుకుంటే, చిన్న విషయాలు కూడా మిమ్మల్ని బాగా బాధిస్తాయి. ఇతరుల కోపం, ఒత్తిడి మీపై ప్రభావం చూపుతాయి. ఇతరుల మాటలను మనసులోకి తీసుకోకుండా, భావోద్వేగాలను నియంత్రించుకోవడం అలవాటు చేసుకోండి.
- ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనిపించడం: అకస్మాత్తుగా ప్రజలకు దూరంగా ఉండాలని లేదా ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని అనిపించడం మానసిక అలసటకు సంకేతం. ఇతరుల సమస్యలను వింటూ, వారి ప్రతికూల ఆలోచనలను ఫీల్ అవ్వడం మిమ్మల్ని బలహీనపరుస్తుంది. మీకు నచ్చిన పనులు చేయడం లేదా ప్రకృతి ఒడిలో సమయం గడపడం ద్వారా రీఛార్జ్ అవ్వండి.
- ఎక్కువ ఆందోళన, అతిగా ఆలోచించడం (Overthinking): ఇతరుల నెగటివ్ ఎనర్జీని గ్రహించే వారు చిన్న విషయాలకు కూడా అతిగా ఆందోళన చెందుతుంటారు. మనసు ఎప్పుడూ అశాంతితో ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ప్రతిరోజూ ధ్యానం (Meditation), యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోండి.
- అకస్మాత్తుగా విచారం లేదా చిరాకు: కారణం లేకుండానే విచారంగా అనిపించడం లేదా చిన్న విషయాలకు చిరాకు రావడం జరుగుతుంటే, మీ చుట్టూ ఉన్న ప్రతికూలత మిమ్మల్ని ప్రభావితం చేస్తుందని అర్థం. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో ఉండండి, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.
నెగటివ్ ఎనర్జీ నుండి రక్షించుకునే మార్గాలు: మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రతిరోజూ మీ కోసం సమయాన్ని కేటాయించుకోండి. తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఎప్పుడూ ఫిర్యాదులు చేసే వారికి, ప్రతికూల ఆలోచనలు ఉన్నవారికి దూరంగా ఉండండి. ఉదయం పూట ధ్యానం చేయడం వల్ల మీ మానసిక శక్తి పెరుగుతుంది.

