Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాల్దీవ్స్ లో తాగిన మత్తులో కొట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ..!

మాల్దీవ్స్ లో తాగిన మత్తులో కొట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ..!

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఆస్ట్రేలియా.. భారత్ నుండి రాకపోకలను బంద్ చేసింది. దీనితో మరో మార్గం లేక ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్ లు, కామెంటర్స్ అందరినీ మాల్దీవ్స్ కు తరలించింది బీసీసీఐ. మాల్దీవ్స్ లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు తప్పతాగి ఒకరితో ఒకరు గొడవ పడి.., కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్ళిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మాల్దీవ్స్ లోనిబార్ లో డేవిడ్ వార్నర్, మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ తాగిన మైకంలో కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వచ్చే టి ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు కూర్పు విషయంలో చర్చ జరుగుతూ ఉండగా ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది.

టీ ట్వంటీ జట్టు కెప్టెన్ గా ఫించ్ సామర్ధ్యంపై వార్నర్ నోరు జారడంతో గొడవ మొదలైనట్టు తెలుస్తోంది. దీనితో అక్కడే ఉన్న మిగతా ఆటగాళ్లు వీరిని వేరు చేసి తమ తమ గదుల్లోకి పంపించి వేసినట్టు సమాచారం. అయితే.., తమపై వచ్చిన ఆరోపణలను డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ ఖండించారు. ఇవన్నీ ఊహాగానాలేనని వారు కొట్టిపారేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com