Dailyhunt
మధ్యాహ్నం 1 గంటకు దీదీకి టాటా, బై-బై. బెంగాల్ ఫలితాలపై అమిత్ షా జోస్యం నిజమైందా? వైరల్ అవుతున్న వీడియో!

మధ్యాహ్నం 1 గంటకు దీదీకి టాటా, బై-బై. బెంగాల్ ఫలితాలపై అమిత్ షా జోస్యం నిజమైందా? వైరల్ అవుతున్న వీడియో!

శ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈరోజు ఒక చారిత్రక మలుపు కనిపిస్తోంది. మే 4, 2026 మధ్యాహ్నం గడియారం ముల్లు 12:30 గంటలకు చేరుకోగానే, సోషల్ మీడియాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఒక పాత వీడియో వైరల్ అయ్యింది.

ఆ వీడియోలో అమిత్ షా ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన సమయం మరియు ప్రస్తుత ఎన్నికల ట్రెండ్స్ ఒకే దిశలో సాగుతుండటం విశేషం. బెంగాల్ ఎన్నికల బరిలో 'కమలం' వికసిస్తుండటంతో, అమిత్ షా చేసిన ఆ 'భవిష్యవాణి' ఇప్పుడు చర్చనీయాంశమైంది. బెంగాల్‌లోని మెజారిటీ స్థానాల్లో 20 నుండి 22 రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉండగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 3 నుండి 9 రౌండ్ల లెక్కింపు మాత్రమే పూర్తయ్యింది. అంటే ఇంకా సగం కంటే ఎక్కువ ఓట్ల లెక్కింపు మిగిలే ఉంది. ఏ క్షణమైనా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది.

అమిత్ షా జోస్యం చెప్పిన ఆ వీడియో కథాకమిత్తు:

ఈ వ్యవహారం ఏప్రిల్ 22, 2026 నాటిది. పశ్చిమ బెంగాల్‌లోని దమ్ దమ్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ ఒక టైమ్ టేబుల్‌ను ప్రజల ముందు ఉంచారు. ఆయన ఏమన్నారంటే: "సోదర సోదరీమణులారా.. మే 4న ఉదయం కౌంటింగ్ మొదలవుతుంది. 8 గంటలకు బ్యాలెట్ బాక్సులు తెరుచుకుంటాయి. 9 గంటలకు మొదటి రౌండ్, 10 గంటలకు రెండో రౌండ్.. మధ్యాహ్నం 1 గంటకు కౌంటింగ్ ముగింపు మరియు దీదీకి టాటా, గుడ్ బై!"

నేడు ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ, ఆయన చెప్పిన ప్రతి అక్షరం నిజమవుతోందంటూ బీజేపీ మద్దతుదారులు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

బీజేపీ రికార్డు స్థాయి ఆధిక్యం:

ఎన్నికల కమిషన్ తాజా గణాంకాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ (BJP) 178 స్థానాల్లో బలంగా దూసుకుపోతోంది. మరోవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (AITC) కేవలం 92 స్థానాలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. 178 అనేది మేజిక్ ఫిగర్ (మెజారిటీ) కంటే చాలా ఎక్కువ. దీంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి.

విపక్షాల పరిస్థితి దారుణం:

తాజా ట్రెండ్స్‌లో ఇతర పార్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది:

  • AJUP: 2 స్థానాలు
  • BGPM, CPI(M), AISF: చెరో 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. దీనిని బట్టి బెంగాల్ ప్రజలు ఈసారి స్పష్టమైన తీర్పు ఇచ్చారని అర్థమవుతోంది. మధ్యాహ్నం 12:30 గంటల నాటికే దీదీ కోటలో బీజేపీ పాగా వేయడం దాదాపు ఖాయమైందని ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com