Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళలూ తస్మాత్ జాగ్రత్త.. "ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 30 మందికి పైగా మహిళలపై లైంగిక దాడి!" పట్టుబడ్డ కామ పిశాచి.. వెలుగులోకి దిగ్భ్రాంతికర నిజాలు..!!

మహిళలూ తస్మాత్ జాగ్రత్త.. "ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 30 మందికి పైగా మహిళలపై లైంగిక దాడి!" పట్టుబడ్డ కామ పిశాచి.. వెలుగులోకి దిగ్భ్రాంతికర నిజాలు..!!

ర్ణాటకలో 30 మందికి పైగా మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేయడమే కాకుండా, వారిపై లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చిన ఈరణ్ణ పడిగర్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తనకున్న అప్పులను తీర్చుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో - ISRO)లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి, ఆన్‌లైన్‌లో ఉద్యోగాల కోసం వెతికే ఎంతోమంది యువతులను పక్కా ప్లాన్‌తో తన వలలో వేసుకుని మోసాలకు పాల్పడ్డాడు.

బాధిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఈరణ్ణ పడిగర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా.. మహిళల అసభ్యకర ఫోటోలు, వీడియోలు మరియు పెద్ద సంఖ్యలో కండోమ్‌లు లభించడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఉద్యోగం కోసం చూస్తున్న మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజడమే కాకుండా, వారిని లైంగికంగా కూడా వాడుకున్నట్లు విచారణలో తేలింది.

ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపగా.. ఆన్‌లైన్‌లో ఉద్యోగాల కోసం చూసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల, జాబ్ ఇప్పిస్తామని డబ్బులు అడిగే మోసగాళ్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈరణ్ణ పడిగర్ చేతిలో ఇంకా ఎవరెవరు మోసపోయారు? ఈ దారుణ ముఠాలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అనే కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com