Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"నాతో వస్తున్నావా లేదా?". కుటుంబ గొడవ ముదరడంతో రెచ్చిపోయిన భర్త. అల్లుడు చేసిన హంగామాతో వణికిపోయిన అత్తగారిల్లు..!!!

"నాతో వస్తున్నావా లేదా?". కుటుంబ గొడవ ముదరడంతో రెచ్చిపోయిన భర్త. అల్లుడు చేసిన హంగామాతో వణికిపోయిన అత్తగారిల్లు..!!!

ధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ ప్రాంతంలో, మద్యం మత్తులో భార్య కోసం వెెళ్లి ఆమె ఇంటిపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

మద్యానికి బానిసైన జోగేంద్ర సింగ్ రాణా అనే వ్యక్తి, తన భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు.

దీంతో భర్త వేధింపులను తట్టుకోలేని అతని భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి సౌజనా గ్రామంలోని తన తండ్రి, బాబాయ్ ఇంట్లో తలదాచుకుంది. గత వారం భార్యను బలవంతంగా తన ఊరికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, ఆమె రావడానికి నిరాకరించడంతో అతని కోపం నషాళానికింటింది.

భార్య పట్టుపట్టి నిరాకరించడంతో, ఆక్రోశానికి గురైన జోగేంద్ర సింగ్ దేశీ కట్టా అని పిలిచే నాటు తుపాకీని తీసుకుని ఆమె ఇంటి ముందుకు వెళ్లి హంగామా చేశాడు. ఇంటి కప్పుపైకిెక్కి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, భయపెట్టేలా ఆకాశం వైపు కాల్పులు జరిపి, తన భార్య బాబాయ్ అయిన అరవింద్ గుర్జర్ అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా కాల్పులు జరిపాడు.

ఈ దాడిలో అరవింద్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడినప్పటికీ, అక్కడ ఉన్నవారంతా భయంతో అరుస్తూ పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు బహోడాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నేతృత్వంలోని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులను చూడగానే మరింత ఆవేశానికి గురైన ఆ వ్యక్తి, లోడ్ చేసిన తుపాకీతో ఇంటిపై నిలబడి వరుసగా బెదిరింపులకు దిగాడు. సుమారు రెండున్నర నుండి మూడు గంటల పాటు సాగిన ఈ హైడ్రామాలో, పోలీస్ అధికారులు తీవ్ర సమయస్ఫూర్తితో అతనితో మాటలు కలిపి దృష్టి మరల్చారు.

అతను బీడీ తాగుతున్న సమయాన్ని అనుకూలంగా మార్చుకుని మెరుపు వేగంతో స్పందించిన పోలీసులు, అతని వద్దనున్న నాటు తుపాకీని, తోటాలను స్వాధీనం చేసుకుని అతడిని పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పట్టుబడిన జోగేంద్రపై పోలీసులు హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com