Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"నేనొచ్చేశానమ్మా..!" 6 ఏళ్ల వయసులో పొరపాటుగా ఎక్కిన రైలు.. 13 ఏళ్ల తర్వాత కన్నతల్లి ఒడికి చేరిన కొడుకు.. మేళతాళాలతో ఘన స్వాగతం.!!

"నేనొచ్చేశానమ్మా..!" 6 ఏళ్ల వయసులో పొరపాటుగా ఎక్కిన రైలు.. 13 ఏళ్ల తర్వాత కన్నతల్లి ఒడికి చేరిన కొడుకు.. మేళతాళాలతో ఘన స్వాగతం.!!

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజా గోప్ అనే బాలుడు, తన 6 ఏళ్ల వయసులో తండ్రి నుంచి తప్పిపోయి పొరపాటున వేరే రైలు ఎక్కి కేరళకు చేరుకున్నాడు.

చిన్నతనంలోనే తప్పిపోవడంతో సొంత మాతృభాషను సైతం మరిచిపోయి, వందల కిలోమీటర్ల దూరంలోని కేరళలో అనాథగా పెరిగిన ఆ బాలుడి కోసం అతని కుటుంబ సభ్యులు గత 13 ఏళ్లుగా నిరంతరం వెతుకుతూనే ఉన్నారు.

ఈ క్రమంలో జార్ఖండ్ మరియు కేరళ రాష్ట్రాల పోలీసుల సమన్వయం, తీవ్ర కృషి ఫలితంగా 13 ఏళ్ల తర్వాత రాజా గోప్‌ను సురక్షితంగా గుర్తించి అతని సొంత ఊరికి తీసుకొచ్చారు.

13 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత రాజా తన కన్నతల్లి, నలుగురు సోదరీమణుల వద్దకు తిరిగి చేరిన ఈ అద్భుత దృశ్యం స్థానికులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. సొంత ఊరికి తిరిగొచ్చిన రాజాకు గ్రామస్తులు, అతని పాత పాఠశాల విద్యార్థులు డప్పు వాయిద్యాలు, డ్యాన్సులతో ఘనంగా ఊరేగింపు నిర్వహించి ఉత్సాహంగా స్వాగతం పలికారు. "నమ్మకం ఎప్పటికీ వృథా కాదు" అనడానికి ఈ భావోద్వేగ ఘటనే నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com