Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"నేనూ చదువుకోవాలి!".. ఒంటికాలితో 400 మీటర్లు గెంతుతూ బడికి వెళ్తున్న 7 ఏళ్ల బాలిక.. కంటతడి పెట్టిస్తున్న హృదయ విదారక గాథ..!!!

"నేనూ చదువుకోవాలి!".. ఒంటికాలితో 400 మీటర్లు గెంతుతూ బడికి వెళ్తున్న 7 ఏళ్ల బాలిక.. కంటతడి పెట్టిస్తున్న హృదయ విదారక గాథ..!!!

త్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన ఏడేళ్ల చిన్నారి రాగిణి, చిన్నతనంలోనే ఎదురైన ఘోర ప్రమాదం వల్ల ఒక కాలు కోల్పోయి దయనీయ స్థితికి చేరింది.

ఆమె ఆరు నెలల పసికందుగా ఉన్నప్పుడే జరిగిన తీవ్ర ప్రమాదంలో వైద్యులు ఆ చిన్నారి కాలును కాపాడలేకపోయారు. కుటుంబ పేదరికం వల్ల మెరుగైన వైద్యం అందించేందుకు డబ్బు లేక ఆ కుటుంబం నిస్సహాయంగా ఉండిపోయింది. అయినప్పటికీ, చుట్టుపక్కల పిల్లలు బడికి వెళ్లడం చూసి తానూ చదువుకోవాలనే బలమైన కోరికను పెంచుకుంది. "నాకూ చదువుకోవాలని ఉంది" అని తల్లి వద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ చదువుపై తనకున్న మక్కువను తెలియజేసింది.

ప్రస్తుతం పాఠశాలకు చేరుకోవడానికి రాగిణి పడుతున్న కష్టం చూసేవారి గుండెల్ని పిండేస్తోంది. తనకున్న ఒకే ఒక్క కాలుతో సుమారు 400 మీటర్ల దూరం గెంతుతూ బడికి చేరుకుంటోంది. ఎంతో ప్రమాదకరమైన, శ్రమతో కూడిన ఈ ప్రయాణంలో మధ్యమధ్యలో ఎన్నోసార్లు ఆగుతూ సేదతీరుతుంది. కొన్ని రోజులు ఒంటరిగా, మరికొన్ని రోజులు కుటుంబ సభ్యుల సాయంతో బడికి వెళ్తుంటుంది. కుటుంబ పేదరికం కారణంగా కృత్రిమ కాలుగానీ లేదా ట్రైసైకిల్‌గానీ కొనుగోలు చేయలేకపోవడంతో, "డీఎం అంకుల్, నాకు ఒక ట్రైసైకిల్ ఇప్పించండి.. నేను దానిపై బడికి వెళ్తాను" అంటూ ఆ చిన్నారి చేసిన అమాయకపు విజ్ఞప్తి అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది.

ఈ చిన్నారి కన్నీటి గాథ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నలుమూలల నుంచీ సహాయం వెల్లువెత్తింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వెంటనే తన బృందాన్ని పంపి ఆ పాపకు అవసరమైన సహాయం అందించారు. రాగిణికి తక్షణమే ఒక వీల్‌చైర్‌తో పాటు ₹25,000 ఆర్థిక సహాయాన్ని అందించిన ఆయన, త్వరలోనే ఆ చిన్నారికి కృత్రిమ కాలు అమర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com