పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "వకీల్ సాబ్". మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. కాగా గత ఏడాది మార్చ్‌లో ఉమెన్స్ డే కానుకగా ఈ సినిమా నుంచి మగువ మగువ తొలి పాట విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి నేడు రెండో పాట విడుదలైంది.
అయితే సత్యమేవ జయతే అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, లెజెండ్ సింగర్ శంకర్ మహాదేవన్‌తో కలిసి పృథ్వీచంద్ర పాడాడు.

