Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"రోజుకు 10 రూపాయల కూలీ.. నేడు 681 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతి!": గురువు ఇచ్చిన చేయూతతో మారిన జీవితం.. చదువు మధ్యలోనే ఆపేసిన యువకుడి సంచలన సక్సెస్ స్టోరీ..!!!

"రోజుకు 10 రూపాయల కూలీ.. నేడు 681 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతి!": గురువు ఇచ్చిన చేయూతతో మారిన జీవితం.. చదువు మధ్యలోనే ఆపేసిన యువకుడి సంచలన సక్సెస్ స్టోరీ..!!!

కేరళలోని వయనాడ్ ప్రాంతానికి చెందిన పి.సి. ముస్తఫా అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించారు.

ఆయన తండ్రి ఒక కాఫీ తోటలో రోజువారీ కూలీగా పనిచేసేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ముస్తఫా చదువును కొనసాగించలేకపోయారు.

దీనికితోడు పాఠశాలలో 6వ తరగతి ఫెయిల్ కావడంతో.. చదువును పూర్తిగా మానేసి తన తండ్రితో కలిసి కాఫీ తోటలో కూలీ పనికి వెళ్లడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆయనకు రోజుకు కేవలం 10 రూపాయలు మాత్రమే కూలీగా లభించేది. ఇలాంటి అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఆయన జీవితంలో ఒక గురువు రూపంలో ఊహించని పెద్ద మలుపు తిరిగింది.

ముస్తఫా దుస్థితిని గమనించిన ఆ మంచి ఉపాధ్యాయుడు.. ఆయన తల్లిదండ్రులను ఒప్పించి ముస్తఫాను తిరిగి పాఠశాలలో చేర్పించడమే కాకుండా, చదువుకు అయ్యే ఖర్చులను తానే భరించి సహాయం చేశారు. ఆ ప్రోత్సాహంతో కష్టపడి చదివిన ముస్తఫా 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. ఆ తర్వాత కాలికట్ (కోజికోడ్) NIT లో ఇంజనీరింగ్ పట్టా, అనంతరం బెంగళూరు IIM లో ఎంబీఏ (MBA) పూర్తి చేసి ప్రతిభ చాటారు.

చదువు పూర్తయ్యాక కొంతకాలం వివిధ సంస్థల్లో ఉద్యోగం చేసిన ఆయన.. 2005లో తన బంధువులతో కలిసి బెంగళూరులో 'ఐడీ ఫ్రెష్ ఫుడ్' (iD Fresh Food) పేరిట ఒక చిన్న ఆహార వ్యాపారాన్ని ప్రారంభించారు. నగరవాసుల అవసరాలను సరిగ్గా గుర్తించి ఇడ్లీ, దోశ పిండి విక్రయాల్లోకి అడుగుపెట్టిన ఆయన వ్యాపారం.. నేడు అనేక దేశాలకు విస్తరించి ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.

గత ఆర్థిక సంవత్సరంలోనే ఈ సంస్థ టర్నోవర్ ఏకంగా ₹681 కోట్లను దాటి రికార్డు సృష్టించింది. పట్టుదల, కఠిన శ్రమ ఉంటే ఎలాంటి పేదరికాన్నైనా జయించి చరిత్ర సృష్టించవచ్చనడానికి పి.సి. ముస్తఫా జీవిత ప్రయాణమే ఒక గొప్ప నిదర్శనం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com