Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాకింగ్.. రూ.18 లక్షల కొత్త బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ప్రముఖ బైక్ రైడర్ అషూ హఠాన్మరణం.. తీవ్ర విషాదంలో అభిమానులు..!!

షాకింగ్.. రూ.18 లక్షల కొత్త బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ప్రముఖ బైక్ రైడర్ అషూ హఠాన్మరణం.. తీవ్ర విషాదంలో అభిమానులు..!!

యూట్యూబ్ వేదికగా తన మోటార్ సైకిల్ ట్రావెల్ వీడియోలతో దాదాపు తొమ్మిది లక్షల మంది అభిమానుల మన్ననలు పొందిన రూర్కీకి చెందిన అషూ కన్నుమూశారు.

యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆయన, శుక్రవారం నాడు డెహ్రాడూన్ లోని సహాస్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఊహించని ఘోర రోడ్డు ప్రమా,లో దుర్మరణం చెందారు.

ఆయన ఈ అకస్మిక మృతి నెటిజన్లను మరియు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

దాదాపు 18 లక్షల రూపాయల ఖరీదైన కొత్త బైక్‌ను కొనుగోలు చేసి స్వగ్రామానికి తిరిగి వస్తున్న మార్గమధ్యంలోనే ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితమే ఆయన 22 లక్షల రూపాయల విలువైన మరో హై-స్పీడ్ బైక్‌ను కూడా కొనుగోలు చేయడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తగిన చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com