Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్కూల్ విద్యార్థిపై విపరీతమైన వ్యామోహం..! ఊచలు లెక్కించనున్న టీచర్.. ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లిన బాలుడు.. కోర్టులో ఊహించని ట్విస్ట్.!!

స్కూల్ విద్యార్థిపై విపరీతమైన వ్యామోహం..! ఊచలు లెక్కించనున్న టీచర్.. ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లిన బాలుడు.. కోర్టులో ఊహించని ట్విస్ట్.!!

మెరికాలో 15 ఏళ్ల స్కూల్ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరానికి గాను, అలిసన్ హేవ్‌మ్యాన్-నీట్రాచ్ (45) అనే మాజీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది.

కోర్టు తుది తీర్పు వెలువరించడానికి ముందు, బాధితుడైన విద్యార్థి తన మానసిక వేదనను వివరిస్తూ అత్యంత భావోద్వేగపూరితమైన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. గత కొన్ని సంవత్సరాలుగా తనను తాను నిందించుకుంటూ తీవ్ర క్షోభ అనుభవించానని, పీడకల లాంటి ఇలాంటి అనుభవం మరెవరికీ రాకూడదని ఆ బాలుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా, తనను వేధించిన ఆ టీచర్‌ను తాను క్షమిస్తున్నానని బాలుడు చెప్పడంతో.. నిందితురాలైన అలిసన్ కోర్టు హాల్లో కన్నీరుమున్నీరవుతూ తన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరింది.

గత 2024లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలుడితో టీచర్ అలిసన్ దాదాపు ఆరు నెలల పాటు అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఈ వ్యవహారం తోటి ఉపాధ్యాయుడికి, స్కూల్ వైస్ ప్రిన్సిపాల్‌కు తెలియడంతో విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ టీచర్ బాలుడికి సుమారు 25,000 మెసేజ్‌లు పంపడం, ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం కారులో గడపడం, అర్ధరాత్రి వరకు ఫోన్లలో మాట్లాడటం బాలుడి తల్లి, సోదరి దృష్టికి వచ్చింది. దీంతో తల్లి తన కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా, టీచర్‌తో ఉన్న శారీరక సంబంధాన్ని బాలుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

ఈ దారుణ పరిణామాల వల్ల మానసికంగా తీవ్ర కుంగుబాటుకు గురైన ఆ బాలుడు ఒక దశలో ఆత్మహత్య ఆలోచనల వరకు వెళ్లాడని విచారణ సందర్భంగా న్యాయమూర్తి గుర్తుచేశారు. నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో తీర్పు వెలువరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. అలిసన్ తన జైలు శిక్షలో కనీసం 85 శాతం కాలాన్ని తప్పనిసరిగా జైలులోనే గడపాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆమెను రిజిస్టర్డ్ సెక్స్ అఫెండర్‌గా ప్రకటించడంతో పాటు టీచింగ్ సర్టిఫికెట్లను శాశ్వతంగా రద్దు చేసింది. భవిష్యత్తులో బాధిత విద్యార్థిని గానీ, అతని కుటుంబాన్ని గానీ ఏ రూపంలోనూ సంప్రదించకూడదని కోర్టు ఆమెపై కఠిన ఆంక్షలు విధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com