Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీచరా ఇతను.. మృగమా?.. చేతులు విరిచి కర్రతో దాడి చేసిన కర్కశత్వం.. క్లాస్‌రూమ్‌లో విలవిలలాడిన పసి ప్రాణం.. తుదిశ్వాస విడిచిన 8వ తరగతి విద్యార్థిని.!!

టీచరా ఇతను.. మృగమా?.. చేతులు విరిచి కర్రతో దాడి చేసిన కర్కశత్వం.. క్లాస్‌రూమ్‌లో విలవిలలాడిన పసి ప్రాణం.. తుదిశ్వాస విడిచిన 8వ తరగతి విద్యార్థిని.!!

త్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో, తోటి విద్యార్థినితో వచ్చిన వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎనిమిదో తరగతి విద్యార్థిని క్షమా దీక్షిత్‌పై ఉపాధ్యాయుడు రాజేంద్ర గంగ్వార్ కర్కశంగా దాడి చేసి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

తన వద్దకు న్యాయం కోసం వచ్చిన ఆ బాలిక రెండు చేతులను బలంగా మెలితిప్పడమే కాకుండా, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగస్టు 26న ఆసుపత్రిలో చేరి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి, దురదృష్టవశాత్తు ఆగస్టు 30న చికిత్స ఫలించక ప్రాణాలు విడిచింది.

ఈ అమానుష ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు తక్షణమే కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి (బీఎస్ఏ) నిందితుడైన ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని (హెచ్ఎం) తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయే ముందు ఆ చిన్నారి తాను అనుభవించిన నరకయాతనను వివరిస్తూ ఇచ్చిన మరణ వాంగ్మూలం (డైయింగ్ డిక్లరేషన్), నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయడంలో అత్యంత కీలక సాక్ష్యంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com