కరోనా కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన వారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కొత్త కొలువులు లేనందున ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు సంపాదన కోసం నాలాలను శుభ్రం చేయవలసిన దుస్థితికి చేరుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన నిరుద్యోగులు వర్షాకాలంలో మహారాష్ట్రలోని మంబ్రా ప్రాంతంలో నాలాలు శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు. మహారాష్ట్రలో డ్రెయిన్‌లను శుభ్రం చేసేపనిని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఈ పనుల్లో చాలా మంది విద్యావంతులు పాల్గొంటున్నారు.
గ్రాడ్యుయేట్ లు నాలాలను శుభ్రం చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నామన్నారు. వారిలో డబుల్ గ్రాడ్యుయేట్ లున్నారనీ, గత మూడు నెలలుగా ఈ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారని తెలుస్తోంది.
ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఈ పనిచేయడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదని మరికొందరు చెప్పడం విషాదం విచిత్రం.

