Thursday, 29 Oct, 4.13 pm NTV Telugu

హోమ్
24 గంటల్లో రాష్యా రికార్డు

మాస్కో: కరోనాతో ప్రపంచం వణికిపోతోంది. రోజురోజుకు ఈ వైరస్ బలం పుంజుకుంటోంది. ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించిన రష్యా గత 24 గంటల్లో మరో రికార్డును సృష్టించింది. రష్యాలో ఇప్పటి వరకు 24 గంటల్లో వచ్చిన అధిక కేసులు 17,347 అయితే దానిని గత 24 గంటల్లో 17,717 కేసులతో అధిగమించింది. అయితే ఒక్క రోజులో ఇన్ని కేసులు రావడం రష్యాలో ఇది రెండో సారి. అక్టోబరు 26న కూడా దాదాపు 17,347లు నమోదయ్యాయి. వీటితో ఇప్పటికీ రష్యాలో మొత్తం 1,581,693 కేసులు వచ్చాయి. వాటితో పాలు 24 గంటల్లో 366 మంది మరణించారు. దీంతో దేశంలో మరణాల సంఖ్య 27,301కు చేరింది. అయితే 24 గంటల్లో 14,740 కేసుల రికవరీతో మరో రికార్డును సాధించింది. వీటితో మొత్తం 1,186,041కు రికవరీ రేటు చేరింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: ntvtelugu
Top