Dailyhunt
2BHK Rent: వామ్మో.. భారత్‌లోని ఈ నగరంలో డబుల్ బెడ్రూమ్ అద్దె రూ. 3 లక్షలు!

2BHK Rent: వామ్మో.. భారత్‌లోని ఈ నగరంలో డబుల్ బెడ్రూమ్ అద్దె రూ. 3 లక్షలు!

NTV Telugu 1 week ago

2BHK Rent: హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో 2 BHK వేలలో ఉంటుంది. కానీ భారత్‌లోని ఓ నగరంలో మాత్రం 2 BHK అద్దె రూ.

2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంది. ఆ నగరం మరేదో కాదు.. దేశ రాజధాని ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీ, దాని శక్తి, చరిత్రకు మాత్రమే ప్రత్యేకం కాదు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కూడా ఫేమస్. ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు చాలా రిచ్‌గా ఉంటాయి. ఆ ఏరియాల్లో ఇల్లు కొనడం అటుంచితే, అద్దెకు తీసుకోవడం కూడా చాలా మందికి సాధ్యం కాదు. మధ్యతరగతి కుటుంబం 2 BHK అద్దె రూ.20,000 నుంచి రూ. 40,000 వరకు బరించగలదు. కానీ ఢిల్లీలోని విలాసవంతమైన ప్రాంతాల్లో దీని అద్దె నెలకు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉందట.

READ MORE: AP Liquor Case: ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. ఏ1 రాజ్‌ కేసిరెడ్డికి బెయిల్‌

ఢిల్లీలో అత్యంత సురక్షితమైన ప్రాంతం చాణక్యపురి. ఇక్కడ విదేశీ రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు ఉంటాయి. ఇక్కడ 2 BHK ఫ్లాట్లు దొరకడం చాలా అరుదు. ఒకవేళ ‘సర్వీస్ అపార్ట్‌మెంట్’ లేదా ‘ఇండిపెండెంట్ ఫ్లోర్’ దొరికినా, దాని అద్దె నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. ఇక ల్యుటియన్స్ ఢిల్లీకి సమీపంలో ఉండే జోర్ బాగ్, గోల్ఫ్ లింక్స్ వంటి ప్రాంతాల్లో పాత బంగ్లాల పై అంతస్తులకే రూ.1.75 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు అద్దె వసూలు చేస్తారు. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువగా బడా వ్యాపారవేత్తలు, సుప్రీంకోర్టు లాయర్లు, విదేశీ ప్రతినిధులు ఉంటారు.

READ MORE: Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్‌.. నూనె లేదు, పిండి లేదు, కరెంట్‌ లేదు.. ఇప్పుడు లాక్‌డౌన్‌..!

దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ ఎప్పుడూ ధనవంతుల మొదటి ఛాయిస్. ఇక్కడి సి-బ్లాక్, ఈ-బ్లాక్లలో ఉండే అత్యాధునిక సౌకర్యాలు గల 2 BHK ఫ్లాట్ అద్దె రూ.1.2 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అంతర్జాతీయ పాఠశాలలు, క్లబ్‌లు దగ్గరగా ఉండటం దీనికి ప్రధాన కారణం. అలాగే చాణక్యపురికి ఆనుకుని ఉండే శాంతి నికేతన్, ఆనంద్ నికేతన్ వంటి ప్రాంతాలు కూడా అత్యంత ‘ఎక్స్‌క్లూజివ్’గా పరిగణించబడతాయి. ‘మ్యాజిక్ బ్రిక్స్’ డేటా ప్రకారం, ఆనంద్ నికేతన్‌లో కొన్ని ప్రీమియం బిల్డర్ ఫ్లోర్ల అద్దె రూ.2.25 లక్షల వరకు నమోదైంది. పురానా ఖిల్లా, జూ పార్కుకు సమీపంలో ఉండే సుందర్ నగర్ ఆర్ట్ గ్యాలరీలకు ప్రసిద్ధి. ఇక్కడ ఇళ్లు చాలా విశాలంగా, రాజసంగా ఉంటాయి. ఇక్కడ ఏదైనా చిన్న 2 BHK యూనిట్ అందుబాటులో ఉన్నా, దాని అద్దె రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.8 లక్షల వరకు పలుకుతుంది. ఇక్కడి హై-ప్రొఫైల్ వ్యక్తుల సాంగత్యం, సెంట్రల్ లొకేషన్ ఈ ప్రాంతాన్ని ప్రీమియం కేటగిరీలో నిలబెట్టాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu