Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!

6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!

NTV Telugu 6 days ago

Vivo T5 Lite 5G: వివో (vivo) భారత మార్కెట్లో తన కొత్త vivo T5 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది వచ్చిన vivo T4 Lite 5Gకు సక్సెసర్‌గా ఈ కొత్త స్మార్ట్ఫోన్ ను మార్కెట్లోకి రానుంది.

ఇప్పటికే కంపెనీ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో భారీ బ్యాటరీతో పాటు పలు కీలక అప్‌గ్రేడ్‌లను ధృవీకరించింది.

6500mAh భారీ బ్యాటరీ:

vivo T5 Lite 5Gలో ప్రధానంగా చెప్పుకోవాలిసింది 6500mAh భారీ బ్యాటరీ. గత మోడల్‌లో 6000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండగా.. ఈసారి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్ వేగంగా ఛార్జ్ అవ్వడమే కాకుండా, ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్‌ను కూడా అందించే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్స్:

లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను కొనసాగించే అవకాశం ఉంది. అలాగే 6.74 అంగుళాల LCD డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌ను కూడా గత మోడల్ మాదిరిగానే అందించనున్నట్లు సమాచారం. ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ కు IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను అందించే అవకాశం ఉంది. గత మోడల్‌లో IP64 రేటింగ్ ఉండగా.. కొత్త ఫోన్‌లో మరింత మెరుగైన రక్షణ లభించనుంది. టీజర్‌లో ఫోన్ వెనుక భాగంలో వెర్టికల్ కెమెరా మాడ్యూల్‌తో పాటు పైభాగంలో వెంట్స్ కూడా కనిపించాయి.

ఎప్పుడు లాంచ్?

vivo T5 Lite 5G ఈ నెలలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ త్వరలో ప్రకటించనుంది. విడుదల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu