Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!

8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!

NTV Telugu 1 week ago

Realme P4s 5G: రియల్‌మీ (realme) భారత్‌లో కొత్తగా రియల్‌మీ పి4ఎస్ 5జి (realme P4s 5G) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. 1.5K రిజల్యూషన్‌తో కూడిన 144Hz AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 7400 Ultra ప్రాసెసర్, 8000mAh భారీ బ్యాటరీ, IP69 రేటింగ్ వంటి ప్రత్యేకతలతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.

AMOLED డిస్‌ప్లే:

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 6.78 అంగుళాల 1.5K శాంసంగ్ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 2772×1272 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. M14 ల్యూమినసెంట్ మెటీరియల్‌ను ఉపయోగించిన ఈ డిస్‌ప్లే స్థానికంగా 6500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. HBM బ్రైట్‌నెస్ 1400 నిట్స్ వరకు ఉంటుంది. డిస్‌ప్లే 100% DCI-P3 కలర్ గామట్‌కు సపోర్ట్ చేస్తుంది. AGC DT Star D+ గ్లాస్ ప్రొటెక్షన్, PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప్రాసెసర్ & సాఫ్ట్‌వేర్:

పనితీరు విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm ఆధారిత MediaTek Dimensity 7400 Ultra 5G ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Mali-G615 MC2 GPU అందించారు. దీనికి అదనంగా HyperVision+ AI చిప్‌ను కూడా అందించారు. ఈ ప్రత్యేక AI చిప్ గ్రాఫిక్స్ రెండరింగ్, ఫ్రేమ్ రేట్ అప్‌స్కేలింగ్, AI ఆధారిత రిజల్యూషన్ ఎన్‌హాన్స్‌మెంట్ వంటి విజువల్ ప్రాసెసింగ్ పనులను నిర్వహిస్తుంది. ఫోన్‌లో 7,000mm² VC కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు.

ర్యామ్ విషయానికి వస్తే.. 8GB, 12GB LPDDR4X ఆప్షన్లు ఉన్నాయి. వర్చువల్ RAM ద్వారా 14GB వరకు అదనపు మెమరీని ఉపయోగించుకోవచ్చు. స్టోరేజ్ పరంగా 128GB, 256GB UFS 3.1 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 7.0తో వస్తుంది. ఈ ఫోన్‌కు మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు రియల్‌మీ తెలిపింది.

కెమెరా & బ్యాటరీ:

కెమెరా విభాగంలో డ్యూయల్ AI కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో OIS సపోర్ట్‌తో ఉన్న 50MP మెయిన్ కెమెరా ఉంది. దీనికి f/1.8 అపెర్చర్ లెన్స్‌ను అందించారు. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. వెనుక కెమెరాతో 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంది. ఇది f/2.4 అపెర్చర్‌తో పనిచేస్తుంది. ఫ్రంట్ కెమెరాతో 1080p 30fps వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంది. ఇక ఇందులో 8000mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రకారం కేవలం 28 నిమిషాల్లో బ్యాటరీ 50% వరకు ఛార్జ్ అవుతుంది.

IP69 రేటింగ్ & డిజైన్:

డిజైన్ పరంగా Pearl Academyతో కలిసి ఈ ఫోన్‌ను రూపొందించారు. ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ టర్కోయిస్/ఆకుపచ్చ, లేత బంగారు రంగు/బీజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫోన్ బరువు 208 గ్రాములు కాగా, మందం 8.6mm. దీనికి డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లను అందించారు. ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, Dual 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, GLONASS, BeiDou వంటి సదుపాయాలు ఉన్నాయి. USB Type-C 2.0 పోర్ట్‌ను అందించారు.

ధర:

స్మార్ట్‌ఫోన్ భారత్‌లో సెప్టెంబర్ 3 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఫ్లిప్కార్ట్ తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.3,000 వరకు డిస్కౌంట్, 12 నెలల వరకు No-Cost EMI ఆఫర్ అందుబాటులో ఉంటుంది. భారత్‌లో realme P4s 5G ధరలు ఇలా ఉన్నాయి..

* 8GB + 128GB: రూ.34,999 - బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.31,999.
* 8GB + 256GB: రూ.37,999 - ఆఫర్ తర్వాత రూ.34,999.
* 12GB + 256GB: రూ.41,999 - ఆఫర్ తర్వాత రూ.38,999.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu