Dailyhunt
ఆ నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి : ఎంపీ కోమటిరెడ్డి

ఆ నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి : ఎంపీ కోమటిరెడ్డి

NTV Telugu 4 years ago

చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించకడానికి సీఎం కేసీఆర్, కేటీఆర్, డమ్మీ హోం మంత్రి మహమూద్ అలీ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాకపోవడం దారుణం అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

నిందితుడిని పట్టిస్తే 10లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదం అని తెలిపారు. చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో పోలీసులు అంతే కారణం. తల్లి పిర్యాదు చేసిన వెంటనే డోర్ ఓపెన్ చేసిఉంటే అమ్మాయి బ్రతికి ఉండేది. కేటీఆర్ ప్రచారాల మంత్రి. బతుకమ్మ అంటూ తెలంగాణ అంత తిరిగే కవిత ఇక్కడికి ఎందుకు రాలేదు. మానవత్వం ఉంటె కేటీఆర్ ఇక్కడికి రావాలి. దళిత గిరిజన బిడ్డలని రాలేదా, కేటీఆర్ సమాధానం చెప్పాలి. వెంటనే దోషులను శిక్షించాలి అని కోరారు.

పోలీసులకు అవార్డు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారు, డబ్బులతో అవార్డులు కొనుక్కుంటున్నారు. దోషులను పట్టుకోకపోవడం పోలీస్ వ్యవస్థ చేతకానితనానికి నిదర్శనం. అమ్మాయి చనిపోయి బాధలో ఉంటె జిల్లా కలెక్టర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం బాధాకరం. చదువుకున్న కలెక్టర్ మాట్లాడే మాటలా ఇవి. సినీ యాక్టర్ ని పరామర్శించే తలసాని శ్రీనివాస్ ఇక్కడికి ఎందుకురారు. ఆయన అసలు మంత్రేనా అని ప్రశ్నించారు. దిశ టైంలో చేసినట్లే చిన్నారి విషయంలో కూడా వెంటనే నిందితులను శిక్షించాలి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu