బాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే . సుశాంత్ మరణం అనంతరం వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కోణం చిలికిచిలికి గాలివానలా తయారవుతుంది. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట అయిన విషయం తెలిసిందే. ఇక విచారణలో రియా 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు వార్తలు వచ్చాయి .. ఇదిలా ఉంటే ఇప్పటికే కంగనా లాంతి హీరోయిన్స్ బాలీవుడ్ లో డ్రగ్స్ విపరీతంగా వినియోగిస్తారు. అన్నిపార్టీల్లో డ్రగ్స్ కామన్ గా ఉంటుంది. అక్కడ 99 శాతం మంది డ్రగ్స్ వాడుతుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఓ ప్రముఖ హీరో పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు షాక్ కు గురిచేస్తున్నాయి.

