Dailyhunt
AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?

AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?

NTV Telugu 3 weeks ago

AC Sales Decline: ఈ ఏడాది వేసవి ప్రారంభమైనా ఎయిర్ కండిషనర్ల (AC) అమ్మకాలు ఊపందుకోలేదు.. సాధారణంగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ ప్రారంభంలోనే ఏసీలకు భారీ డిమాండ్ ఉంటుంది.

అయితే ఈసారి అకాల వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మార్కెట్‌లో కొనుగోలుదారులు తగ్గిపోయారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి సీజన్‌లో ఏసీల డిమాండ్ సుమారు 30 శాతం వరకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీలు ముందుగానే సిద్ధం చేసుకున్న భారీ స్టాక్‌లు ఇప్పుడు డీలర్ల వద్ద పేరుకుపోయాయి. సుమారు 25 లక్షల యూనిట్ల వరకు నిల్వలు ఉండటం కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది.

YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

ఈ పరిస్థితి స్టాక్ మార్కెట్‌లో కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా Voltas వంటి మార్కెట్ లీడర్ కంపెనీ షేర్లు గత నెలలో 15 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. అలాగే Blue Star షేర్లు కూడా సుమారు 18 శాతం వరకు తగ్గాయి. Havells India, Whirlpool India మరియు LG Electronics షేర్లు కూడా క్షీణతను చవిచూశాయి. వాతావరణం మాత్రమే కాదు, ఇతర కారణాలు కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. 2026 జనవరిలో అమల్లోకి వచ్చిన కొత్త ఇంధన సామర్థ్య (BEE) నిబంధనల వల్ల ఏసీల ధరలు 5-10 శాతం వరకు పెరిగాయి. దీంతో మధ్యతరగతి వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గింది. అదనంగా, రాగి వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం కూడా కంపెనీలకు సవాలుగా మారింది.

అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, మే, జూన్ నెలల్లో వడగాలులు పెరిగితే ఏసీల డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఆ నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం మందగించిన మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, వాతావరణ మార్పులు, పెరిగిన ధరలు, ఆర్థిక ఒత్తిడులు కలిసి ఏసీ మార్కెట్‌ను తాత్కాలికంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇక రాబోయే నెలల్లో వేడి తీవ్రత పెరిగితేనే ఈ రంగం మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu