Dailyhunt
Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!

Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!

NTV Telugu 3 weeks ago

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు అభిమానులతో నేరుగా ముచ్చటించే అవకాశం ఉంటుంది కానీ, కొందరు నెటిజన్లు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. తాజాగా హీరోయిన్ అదా శర్మకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

అయితే ఆమె అస్సలు తగ్గకుండా, తనదైన ‘స్మార్ట్’ రిప్లైతో ఆ నెటిజన్ నోరు మూయించారు. అదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తరచూ AMA (Ask Me Anything) సెషన్లు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ..

“మీ సైజ్ ఎంత?” అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా అసభ్యకరంగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వెనుక ఉన్న నీచమైన ఉద్దేశ్యాన్ని వెంటనే గ్రహించిన అదా శర్మ, ఏమాత్రం తడబడకుండా.. “నా సైజు 9.. అంటే నా చెప్పుల సైజు!” అంటూ తన చెప్పును చూపిస్తూ పవర్ ఫుల్ కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు చాలామంది హీరోయిన్లు మౌనంగా ఉంటారు లేదా ఆ ప్రశ్నను స్కిప్ చేస్తారు. కానీ అదా శర్మ మాత్రం తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో, హ్యూమర్‌ను జోడించి ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.. 'ఇలాగే బుద్ధి చెప్పాలి', 'రియల్ క్లాస్ రిప్లై' అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం అదా శర్మ 'సూపర్ వెల్లి' (Super Velli) అనే సినిమాలో నటిస్తున్నారు. రాజేష్ బచ్చాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, అలాగే సూపర్ హీరో షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu