Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AK47 : 'ఆదర్శ కుటుంబం' ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ'.. ఈరోజైన వస్తుందా?

AK47 : 'ఆదర్శ కుటుంబం' ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ'.. ఈరోజైన వస్తుందా?

NTV Telugu 1 hr ago

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో, మూవీ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొంటాయి. వీరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47′ . అయితే మొదట ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినప్పటికీ, కొన్ని సాంకేతిక, ఇతర కారణాల వల్ల వారం రోజులు వాయిదా వేసి చివరకు అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు .

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సెప్టెంబర్ 22న మొదటి పాట ‘నారాయణమ్మ‘ విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే సినిమా విడుదల తేదీ మారడంతో ఈ ఫస్ట్ సింగిల్ విడుదల కూడా వాయిదా పడింది. పాటపై ఇప్పటివరకు అధికారిక అప్‌డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాటను సెప్టెంబర్ 27న అనగా ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

మరి కనీసం ఏరోజైనా సాంగ్ రిలీజ్ చేస్తారో లేక మరోసారి వాయిదా వేస్తారో చూడాలి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా నారా రోహిత్, నివేథా పెతురాజ్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ కుటుంబ కథా చిత్రానికి సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్-వెంకటేష్ మేజిక్ తో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu